Mohan babu want to Start his Own Party
పార్టీ పెట్టాలనుకున్న మాట నిజమే..అప్పట్లో ప్రకటించాను కూడా.. అంటూ తన మనస్సులో మాటను మీడియా ముందు బయిట పెట్టారు మోహన్ బాబు. ఓ ప్రెవేట్ టీవీ ఛానెల్ తో ఆదివారం రాత్రి మాట్లాడుతూ ఈ విషయాలను ప్రస్ధావించారు. ఆయన మాటల్లోనే..పార్టీ పెట్టాలనుకున్న మాట నిజమే..అప్పట్లో ప్రకటించాను కూడా. ఇప్పుడు అలాంటి ఆలోచన లేదు. ఎందుకులే అనిపిస్తోంది. రాజకీయాల్లోకి వచ్చి మంచి చేద్దామన్నా, అందుకు ఎందరు సహకరిస్తారన్న ఆలోచనే కలవరపెడుతోంది. మనుషులకు తృప్తి లేదు. రాజకీయాల్లో ఎంతో ప్రజాసేవ చేసిన అన్నగారినే ఓడించారు. అంతేనా లేక...చిరంజీవి పార్టీ ప్రయోగం విఫలమైందని వెనక్కు తగ్గారా? అని అడగగా నేను పేర్లు ప్రస్తావించను కానీ.. ఆ ఒక్కటే కాదు.. ఎన్నో పార్టీలున్నాయి. తెలంగాణ ఒక్కటే వెనుకబడిందంటారు. నేనొప్పుకోను. రాయలసీమలో ఒక్కపూట భోజనానికీ ఇబ్బందిపడే పరిస్థితులున్నాయి. ఎందరో ప్రభుత్వంలో ఉ న్నత స్థానాలను అలంకరించారు. కానీ..వారు సీమ కోసం ఏం చేశారంటే..ఎన్నో ప్రశ్నలు. నామటుకైతే సమైక్యాంధ్రే ఉండాలని కోరుకుంటాను. నాకూ సీమ ఉద్యమం చేయాలనుంది. అంటే.. ప్రత్యేక రాష్ట్రం కావాలని కాదు..అభివృద్ధి కోసమే అంటూ చెప్పుకొచ్చారు మోహన్ బాబు.
