|

Nithin Marriage with Bhavana?

Bhavana had been continuously buzzed as she was in love with Actor Nitin. More than their love there was even rumours that they planned to marry.

సినీ హీరోయిన్స్ అంతా వరసగా వివాహాలు చేసుకుంటున్న నేపధ్యంలో మరో హీరోయిన్ కూడా పెళ్లికి రెడీ అని తమిళ మీడియా ప్రకటించింది. ఇంతకీ వరుడు ఎవరా అంటే మన తెలుగు హీరో నితిన్ అని తేల్చింది. జీవి దర్శకత్వంలో వచ్చిన "హీరో" చిత్రం షూటింగ్ సమయంలో ఆ చిత్రం హీరో నితిన్, హీరోయిన్ భావన ప్రేమలో పడ్డారని త్వరలోనే వీరి వివాహం జరగనుందని ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. ఇక ఆ మధ్యన వీరిద్దరూ ఒకే రూమ్ ని షేర్ చేసుకోవటం కూడా ఈ వార్తకు బలానిస్తోంది. అదే విషయాన్ని వారు హైలెట్ చేస్తూ రాస్తున్నారు. ఇక చెన్నైలో వీరిద్దరూ షాపింగ్ లు, పబ్ లు అంటూ తిరుగుతున్నారని అంటున్నారు. ఇష్క్ షూటింగ్ గ్యాప్ లో నితిన్ చెన్నైకి వస్తున్నారని అక్కడ మీడియా అంటోంది.

భావన సైతం పెద్దగా సినిమాలు లేక చాలా ఖాళీగా ఉంది. దాంతో ఇద్దరూ హాట్ హాట్ గా ప్రేమాయణం నడుపుతున్నారని,త్వరలోనే ఇద్దరి ఇళ్లలో ఈ విషయం పై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. అయితే ఎప్పటిలాగే ఈ విషయమై భావన స్పందిస్తూ...ఎలా రూమర్స్ ప్రచారంలోకి వస్తాయో అర్దం కావటం లేదు. బహుసా మేమిద్దరం రెండు సినిమాల్లో కలిసి నటించేసరికి ఈ లింక్ మీడియా పెట్టి ఉంటుంది. నితిన్ నాకు మంచి మిత్రుడు... శ్రేయాభిలాషి.. అంతకు మించి మా ఇద్దరి మధ్యా ఏమీ లేదు అని తేల్చేసింది. మొన్నటివరకూ స్నేహ కూడా తనిప్పుడు పెళ్లి చేసుకోబోయే హీరో ప్రసన్న గురించి ఇలాగే చెప్పుకొచ్చింది కదా

Posted by Andhra Gossips on 09:07. Filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips