Balakrishna is the Chief Guest of Dammu
Nandamuri Balakrishna is going to attend as the chief guest for jr NTR Dammu function.
జూ.ఎన్టీఆర్ తాజా చిత్రం ‘దమ్ము’కు ఛీప్ గెస్ట్ గా నందమూరి స్టార్ హీరో బాలకృష్ణ రానున్నారని సమాచారం. ‘దమ్ము’ చిత్రం ఆడియో ఉగాది సందర్భంగా మార్చిన 23న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శిల్పకళా వేదిక మీద ఈ ఆడియో పంక్షన్ జరగనుంది. ప్రస్తుతం దమ్ముచిత్రం షూటింగ్ గత కొన్ని రోజులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే జరుగుతోంది. నందమూరి ఫ్యామిలీకి సింహా లాంటి భారీ విజయాన్ని అందించిన బోయపాటి శ్రీను ‘దమ్ము’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష, కార్తీక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై అలెగ్జాండర్ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూనియర్ సరసన త్రిష కార్తీక నటిస్తున్నారు. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని...ఒక పాత్రలో పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్‌గా, మరొక పాత్రలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు అని తెలుస్తోంది. అయితే ఇందులో ఫ్యాక్షనిస్టు పాత్రలో ఫాదర్ గా, పోలీస్ ఆఫీసర్ పాత్రలో కుమారుడిగా దర్శనం ఇవ్వబోతున్నాడని సమాచారం. హీరోయిన్ కార్తీక ఇందులోని ఎన్టీఆర్ ఫాదర్ పాత్రకు జోడీగా నటిస్తుండగా... పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఉండే ఎన్టీఆర్‌తో త్రిష రొమాన్స్ చేయనుందని అంటున్నారు. బోయపాటి శ్రీను దర్సకత్వం వహిస్తున్న ఈ చిత్రం పక్కా మాస్ ఎంటర్టైనర్ గా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు అంచనాలు వేస్తున్నారు.
