|

I Hate Men - Nitya Menon

Ishq movie has been getting positive response from all the quarters and the lead actress Nithya Menon is being praised by one and all. Now keeping her craze in mind Tollywood producers are bringing her Malayalam movies to be dubbed in Telugu as a Dil Se.


హీరోయిన్ నిత్యా మీనన్ త్వరలో మగాళ్లను ద్వేషించే అమ్మాయిగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రొటీన్ ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా..నిత్యామీనన్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘వయోలిన్’. మళయాళంలో ఇటీవల విడుదలై హిట్టయిన ఈ చిత్రానికి శిబిమలయిల్ దర్శకుడు. తెలుగులో యస్.టీమ్ పిక్చర్స్ ద్వారా ‘దిల్ సే’ పేరుతో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా యస్.టీమ్ యూనిట్ మాట్లాడుతూ...‘ఈ చిత్రం మ్యూజికల్ బ్యాక్ డ్రాప్‌తో ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కింది. మగవారిని ద్వేషించే హీరోయిన్ నిత్యామీనన్ మనసును హీరో ఎలా గెలుచుకున్నాడన్నదే ఈచిత్రం కథాంశం. హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమను సప్తస్వరాలు ఎలా ఏకం చేశాయనేది దర్శకుడు శిబిమలయిల్ అద్భుతంగా తెరకెక్కించాడు. నేషనల్ అవార్డ్ విన్నర్ మనోజ్ పిళ్లై ఫోటో గ్రఫీ ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుంది. నిత్యా మీనన్‌కు జోడీగా అసిఫ్ అలీ నటించిన ఈ చిత్రం నడిముడి వేణు, లక్ష్మి రామకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. త్వరలో ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకోనుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : మనోజ్ పిళ్లై, సంగీతం : బిజిబాల్, నిర్మాత : యస్.టీమ్ పిక్చర్స్, దర్శకత్వం శిబిమలయిల్.

నిత్యా మీనన్ తాజాగా తెలుగులో నటించిన ‘ఇష్క్’ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈచిత్రంలో నిత్య మీనన్ నటనకు, గ్లామర్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆమె తాజా సినిమా ‘దిల్ సే’ చిత్రానికి కూడా తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని దర్శక నిర్మాతలు ఆశిస్తున్నారు.


Posted by Andhra Gossips on 11:10. Filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips