|

I am Ready to Act as Villian - Manoj

Manoj says “I will definitely act in multi-starrers and I would love to do good villain roles as well. I look for good acting challenges and any role that challenges me and satisfies me as an actor will appeal to me”.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చిన్న తనయుడు మంచు మనోజ్ ఇటు హీరోగా రాణించడంతో పాటు, మల్టీస్టారర్ చిత్రాల్లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే విలన్ పాత్రలు చేయడానికి కూడా తాను వెనకాడబోనని, నటుడిగా అన్ని విషయాల్లోనూ నాన్నే స్ఫూర్తి అని చెప్పుకొచ్చాడు. ‘మిస్టర్’ నూకయ్య చిత్రం అందరికీ నచ్చుతుందని, ఇందులో తాను సెల్ ఫోన్ల దొంగగా నటిస్తున్నట్లు వెల్లడించారు. మా ఇంట్లో నేనే పెద్ద దొంగని నేనే, చిన్నప్పుడు నా చూపంతా అమ్మ పర్సుపైనే ఉండేది, పెద్ద నోట్లు నొక్కేస్తే అమ్మ గుర్తు పడుతుందని చిల్లర నొక్కేసే వాన్ని....నిజ జీవితంలోని ఆ అనుభవం ఇప్పుడు సినిమాల్లో కూడా పని కొస్తుందని చమత్కరించాడు.


‘మిస్టర్ నూకయ్య’ చిత్రం మార్చి 8న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అని కన్నెగంటి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని డిఎస్ రావు నిర్మిస్తున్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటున్నట్లు దర్శక నిర్మాతలు వెల్లడించారు.



మొన్నటి వరకు చిత్రం పేరు మిస్టర్ నోకియాగా ప్రచారంలో ఉంది. అయితే నోనియా సెల్ ఫోన్ కంపెనీ వారు తమ పేరు వాడుకోవడంపై నోటీసులు ఇవ్వడంతో ఆ సినిమా పేరును మిస్టర్ నూకయ్యగా మార్చినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.


Posted by Andhra Gossips on 11:13. Filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips