Jr NTR Compromises with Balakrishna
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మామ నారా చంద్రబాబు నాయుడిపై ప్రచ్ఛన్న యుద్ధం సాగిస్తున్న సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ తాత్కాలికంగా వెనకడుగు వేసినట్లు చెబుతున్నారు. ఆయన తన బాబాయ్ బాలకృష్ణతో రాజీకి వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఈ రాజీలో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ నటించిన దమ్ము చిత్రం ఆడియో విడుదల కార్యక్రమానికి రావడానికి బాలకృష్ణ అంగీకరించారని చెబుతున్నారు. కొంత కాలంగా వారిద్దరు దూరంగా ఉంటున్నారు.
తెలుగుదేశం పార్టీలోని అంతర్గత పోరు బాలయ్యను జూనియర్ ఎన్టీఆర్‌కు దూరం చేసింది. అయితే, చంద్రబాబు తన కుమారుడు నారా లోకేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగించే విషయంలో వెనక్కి తగ్గడంతో నందమూరి హరికృష్ణ, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ సామరస్యంతో పనిచేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌కు ఇంకా రాజకీయానుభవం కావాలని హరికృష్ణ అనడం, జూనియర్ ఎన్టీఆర్‌తో విభేదాలు లేవని నందమూరి హీరో తారకరత్న చెప్పడం ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి.