Doctor Report @ Ram Charan Injury
హీరో రామ్‌చరణ్ 'రచ్చ'చిత్రంలో డాన్స్ చేస్తూ శనివారం .ప్రమాదానికి లోనయ్యన సంగతి తెలిసిందే. ఆయన్ను అపోలో హాస్పటిల్ లో ట్రీట్ మెంట్ కు తీసుకువెళ్లారు. రామ్ చరణ్ ని ట్రీట్ చేస్తున్న డాక్టర్ కె.జె.రెడ్డి వివరాలు వెల్లడిస్తూ ''గాయం వల్ల అంతర్గతంగా రక్తస్రావమైంది. శస్త్రచికిత్స అవసరం లేదు. అయితే మూడు వారాలపాటు విశ్రాంతి అవసరం. కూర్చొనేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎక్కువసేపు నిలబడి ఉండకూడదు'' అన్నారు. వాస్తవానికి అంతకు ముందు నృత్యానికి సంబంధించి రిహార్సల్స్ చేస్తుండగా చరణ్ పడిపోయారు. చిన్న గాయమే అనుకొని ప్రాథమిక చికిత్స అనంతరం చిత్రీకరణలో పాల్గొన్నారు. నొప్పి పెరగడంతో గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చరణ్‌కి పరీక్షలు నిర్వహించారు. తుంటి భాగంలోని కండరానికి గాయమైనట్లు వైద్యులు నిర్థరించారు. 'రచ్చ' చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ ''వైద్యుల సూచన మేరకు చరణ్ విశ్రాంతి తీసుకొంటున్నారు. ఆదివారం జరిగే 'రచ్చ' పాటల వేడుకలో ఆయన పాల్గొంటారు. ఇక చిత్రానికి సంబంధించిన ఒక పాటను మాత్రమే చిత్రించాల్సి ఉంది'' అన్నారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్ వి ప్రసాద్ మరియు పరాస్ జైన్ లు మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. తమన్నా హీరోయిన్. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందించారు.
