భయపెడుతున్న మనీషా కొయిరాల జీవిత చరిత్ర
మనీషా కొయిరాల తన జీవిత చరిత్రను రాసే పనిలో బిజీగా ఉంది. దాంతో చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు ఉలిక్కి పడుతున్నారు. ఆ చరిత్రలో తమ చరిత్రలు ఎక్కడ తవ్వి బయిట పడేస్తుందో అని టెన్షన్ పడుతున్నారు. ఈ విషయమై మనీషా కొయరాలా మాట్లాడుతూ...‘‘కొన్నాళ్ల క్రితం నేను మనశ్శాంతిని కోల్పోయిన మాట నిజం. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాను. నా జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు. అవి చాలామందికి కనువిప్పును కలిగిస్తాయని నా నమ్మకం. అందుకే ఈ చరిత్రకు ఉపక్రమిస్తున్నాను’’ అన్నారు.
ఇక రీసెంట్ గా మనీషా కొయరాలా తెగ తాగి ముంబై వీధులో వీరంగం చేయటం మీడియాలో బాగా పబ్లిసిటీ అయ్యింది. మరో ప్రక్క ఆమె కాపురం వదిలేసి వచ్చి ఇక్కడ ఉంటోంది. మళ్లీ వేషాల కోసం ట్రై చేస్తున్నా ఎవరూ వేషం ఇవ్వటానికి ఆసక్తి చూపటం లేదు. ఈ నేపధ్యంలో ఆమె భక్తి మార్గం ఎంచుకుంది. అంతేగాక తనలాంటి నటీమణులకు తన జీవితం కనువిప్పు కావాలని నిర్ణయించుకుని ఈ పుస్తకం రాయాలని నిర్ణయంచుకుంది అని ఆమె సన్నిహితులు బాలీవుడ్ మీడియాతో వ్యాఖ్యానించారు. త్వరలోనే ఈ పుస్తకం బయిటకు రానుంది. అప్పుడే పబ్లిషర్స్ ఆమె ఇంటి చుట్టూ ఆ పుస్తకం రైట్స్ ఇవ్వమని వెంటబడుతున్నారు.
