More Masala Song in Mahesh Babu
Sukumar, Mahesh combination film item song would be filled with enough masala.
మహేష్ బాబుని అభిమానించే వారికి కొత్త భయం పట్టుకుంది. ఆయన తాజాగా సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం కమిటయ్యారు. దూకుడు నిర్మాతలు నిర్మిస్తున్న ఆ చిత్రం లో ఓ ఐటం సాంగ్ ఉంటుందని, అది చాలా బాతు గా ఉండబోతోందని రూమర్ బయిలుదేరింది. గతంలో సుకుమార్ చిత్రాలైన ఆర్యలో అ అంటే అమాలాపురం... ఆర్య 2లో ఇంకొంచెం డోస్ పెంచి రింగ రింగ, జగడంలో ముప్పై ఆరు.. ఇరవై నాలుగు పాట, మొన్న వచ్చిన హండ్రెడ్ పర్శంట్ లవ్ లో డియ్యాలో డియ్యాల పాట ఇలా ప్రతీ సుకుమార్ చిత్రంలో ఓ మాస్ మసాలా ఐటం సాంగ్ ఉంటుంది.
ప్రతీ చిత్రానికి ఆయన డోస్ పెంచుతూ వస్తున్నారు. హండ్రెడ్ పర్శంట్ లవ్ చిత్రంలో ఏకంగా ఆడా, మొగా కానివారిని తీసుకువచ్చి మరీ పాటలో పెట్టి డాన్స్ చేయించారు. దాంతో ఈ సారి ఎలాంటి పాట మహేష్ చిత్రంలో పెడతారో అని కంగారుపడుతున్నారు. ఇక ఈ పాటని చంద్రబోస్ ఇప్పటికే రాసేసాడని చెప్పుకుంటున్నారు. మహేష్ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ ఉండే నేపధ్యంలో ఈ పాట ఇబ్బంది పెట్టదా అనే సందేహం అభిమానుల వెళ్లబుచ్చుతున్నారు. అయితే మహేష్ బిజినెస్ మ్యాన్ లో డైలాగులు సైతం శృతి మించి ఉన్నా ఫ్యామిలీలు చూడలేదా అని మరికొందరు లాజిక్కులు తీస్తున్నారు.
