|

Pawan Kalyan Eyes on Anuskha and Nayanatara


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం ప్రస్తుతం హీరోయిన్ల అన్వేషణ జరుగుతోంది. పవర్ స్టార్ ఇమేజ్‌తో పాటు... హీరోయిన్ పెర్ఫార్మెన్స్ , గ్లామర్ కూడా సినిమాకు ముఖ్యం కాబట్టి సెలక్షన్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. పులి, పంజా చిత్రాల్లో కొత్త హీరోయిన్లను ఎంపిక చేసుకున్న పవర్ స్టార్....అవి ప్లాపు కావడంతో కోలుకోలేని దెబ్బతిన్నాడు. అయితే ఈ సారి అలా కాకుండా ఉండటానికి ‘ముదురు’ భామలపై కన్నేశాడు. నిన్న మొన్నటి వరకు ఈ చిత్రంలో కాజల్‌ను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారని వార్తలు వినిపించినా....తాజాగా అనుష్క, నయనతార పేర్లను కూడా పరిశీలిస్తున్నారని అంటున్నారు. ఈ ముగ్గురు హీరోయిన్లకు ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో వీరిలో ఎవరితో రొమాన్స్ చేయడానికైనా రెడీ అని దర్శకునికి పవర్ స్టార్ చెప్పారని పిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రెడీ అవనున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా కనిపించబోతున్నాడు. మే నెలలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. గతంలో బంగారం సినిమాలోనూ పవన్ కళ్యాణ్ మీడియా జర్నలిస్టు పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మేలో షూటింగ్ ప్రారంభం అయి, దసరా నాటికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.


Posted by Andhra Gossips on 11:16. Filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips