|

Pawan Kalyan Six Pack in Gabbar Singh

Following the footsteps of Salman Khan Pawan Kalyan will take off his shirt in the climax of Gabbar Singh, a remake of Bollywood movie Dabangg.


పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ లో ఓ ప్రత్యేకత ఉండనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ తన బాడీని చూపటానికి క్లైమాక్స్ లో చొక్కా విప్పుతాడని అంటున్నారు. మొదటి సారిగా ఈ హీరో తన బాడీని తెరపై చూపనున్నారు. రీసెంట్ గా సునీల్..తన చిత్రం పూల రంగడులో చేసిన ఫీట్ లాంటిదే చేయబోతాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అందుకోసం ఓ స్పెషల్ ట్రైనర్ ని పెట్టుకుని మరీ పవన్ తన బాడీని ఫిట్ గా మారుస్తారు. స్పెషల్ డైట్ తీసుకుంటూ ఆయన తన శరీరాన్ని మార్చే విధానం యూనిట్ లో అందరిని ఆశ్చర్యంలో పడేస్తోందని చెప్తున్నారు. 


దబాంగ్ చిత్రం రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కథ ప్రకారం హీరో తన షర్ట్ తీసి మరీ పవర్ చూపిస్తాడు. ఆ ఫీట్ ని తమిళంలో శింబు అవలీలలగా చేసాడు. ఇప్పుడు పవన్ చేయబోతున్నాడు. ఇక ఆ మధ్యన విడుదల చేసిన గబ్బర్ సింగ్ టీజర్ అన్ని వర్గాలని ఆకట్టుకుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పంచ్ డైలాగులు ప్రాధాన్యత వహించనున్నాయి. శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో అభిమన్యుసింగ్ విలన్ గా చేస్తున్నారు. ఈ చిత్రం మరో ట్రెండ్ సెట్టర్ అవుతుందని భావిస్తున్నారు.


Posted by Andhra Gossips on 21:45. Filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips