Pawan Kalyan Gabbar Singh Release Date
Power Star Pawan Kalyan’s most awaited movie Gabbar Singh Release Date has been confirmed on May 9.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘గబ్బర్ సింగ్’ ఎప్పుడు విడుదలవుతుందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం మే 9న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే దాదాపుగా కంప్లీట్ అయింది. క్లైమాక్స్ సీన్స్ మాత్రం మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన చిత్రీకరణ మార్చి 9వ తేదీ నుంచి మొదలు కానుంది.
గబ్బర్ సింగ్ చిత్రంపై సినీ ప్రమికుల్లో, పవన్ కళ్యాణ్ అబిమానుల్లో రోజు రోజుకు అంచనాలు పెరిగి పోతున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్, అందులో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ సినిమాపై మరింత హైప్ పెంచాయి. ‘నా కొంచెం తిక్క ఉంది..కాని దానికో లెక్క ఉంది’ అంటూ దర్శకుడు రాసిన మాటలకు మంచి స్పందన వస్తోంది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన సూపర్ హిట్ మూవీ దబాంగ్ రీమేక్‌గా ఈ చిత్రాన్ని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రంలో నటించబోతోంది. మే నెల నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో కాజల్, అనుష్క, నయనతారలను హీరోయిన్ పాత్రల కోసం పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఖరారు కానున్నారు.
