|

Shriya Withdraws her Complaint


నిర్మాతపై ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ చేసిన శ్రియ దాన్ని వెనక్కి తీసుకుంది. దాంతో ఆమె నటించిన రాజా పోకిరి రాజా చిత్రానికి ఆటంకం తొలగిపోయింది. ఈ చిత్రాన్ని త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు ఆ చిత్ర నిర్మాత మలేషియా పాండియన్ వెల్లడించారు. యలయాళంలో ముమ్మట్టి, ఫృద్వీరాజ్, శ్రీయ నటించిన చిత్రం ‘పోకిరి రాజా’ ఈ చిత్రాన్ని నిర్మాత మలేషియా పాండియన్ ‘రాజా పోకిరి రాజా’ పేరుతో తమిళంలోకి అనువదిస్తున్నారు. కాగా ఈ మలయాళ చిత్రాన్ని ఏ ఇతర భాషలోకి అనువదించకూడదనే నిబంధనతోనే తాను ఇందులో నటించడానికి అంగీకరించానని అందువల్ల దీన్ని తమిళంలో విడుదల కాకుండా నిషేధించాలంటూ నటి శ్రీయ నడిగర్ సంఘంకు ఫిర్యాదు చేశారు.   అయితే నటి శ్రీయకు తనకు ఎలాంటి సంబంధం లేదని రాజాపోకిరి రాజా చిత్రంపై నిషేధం విధిస్తే ఆమెపై నష్ట పరిహారం కేసు వేస్తానని ప్రకటిండంతో పాటు మలేషియా పాండియన్ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. కాగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించి పూర్తిగా శ్రీయ, ఆమె తండ్రికి వివరించడంతో తమ ఫిర్యాదును వాపసు తీసుకున్నారని, నిర్మాత తెలిపారు. రాజా పోకిరి రాజా చిత్రాన్ని నిషేధిస్తే తనకు నష్టం వస్తుందన్న విషయాన్ని శ్రీయకు వివరించానన్నారు. మీకు నష్టం కలిగించాలన్నది తమ అభిమతం కాదని శ్రీయ, ఆమె తండ్రి తనతో చెప్పి నడిగర్ సంఘం నుంచి తమ ఫిర్యాదును వెనక్కు తీసుకున్నారని నిర్మాత మలేషియా పాండియన్ తెలిపారు. ఇక రీసెంట్ గా శ్రియ నటించిన నువ్వా-నేనా చిత్రం తెలుగులో విడుదలై ఫ్లాఫ్ అయ్యింది.

Posted by Andhra Gossips on 18:54. Filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips