Avatar 2 is Coming in 2015
టైటానిక్ మరియు అవతార్ చిత్రాల సృష్టికర్త జేమ్స్ కెమెరూన్ "అవతార్-2" చిత్రాన్ని 2014లో విడుదల చేయాలనుకున్నారు. కానీ, కొన్ని కారణాల వల్ల చిత్ర విడుదలకి 2015 వరకూ పట్టవచ్చని ఆ చిత్ర నిర్మాత జాన్ లేండా స్పష్టీకరించారు. నిజానికి "అవతార్-2" చిత్రాన్ని 2014 లోనూ, తర్వాతి సంవత్సరం "అవతార్-3" చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు. "మేము తేదీలను ప్రకటించలేము. కానీ, 2014లో విడుదల చేయడం మాకు చాలా సవాల్‌తో కూడుకున్న పని" అని చిత్ర నిర్మాత లేండా చెప్పారు.
ప్రస్తుతం జేమ్స్ కెమెరూన్ "టైటానిక్ 3డి" పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అది "అవతార్-2" నిర్మాణానికి ఆలస్య హేతువులలో ఒకటి. నిర్మాణ పరంగా చెప్పాలంటే "అవతార్-2" 2015 లోగా విడుదల అయ్యే అవకాశమే లేదు అని లేండా తెలియజేశారు. "అవతార్ - 2" చిత్రాన్ని "పండోరా" అనే పేరుతో విడుదల చేయనున్నారు.
