|

Priyanka Chopra is in Danger With IPL

Actress Priyanka Chopra who sizzled in the opening ceremony of IPL, was very upset over few comments made by the cricketers. Priyanka apparently got upset when the cricketers voted for Kareena Kapoor's performance over hers.


బాలీవుడ్ హాట్ హీరోయిన్ ప్రియాంక చోప్రా వరుస వివాదాలతో తన కెరీర్‌ను డేంజర్లో పడేసుకుంటోంది. వివాదాలకు తోడు ఆమె నటించిన సినిమాలన్నీ వరుసగా ప్లాపవుతుండటం ప్రియాంక కెరీర్‌కి శాపంగా మారాయి. డాన్ 2 సినిమా నుంచే అమ్మడుకి కష్టాలు మొదలయ్యాయి పాపం. 


ఈ సినిమా షూటింగ్ దగ్గరి నుంచి షారుఖ్‌ , ప్రియాంక మధ్య సన్నిహిత్యం బాగా పెరిగిందని, ఇద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందని, విషయం డేటింగ్ వరకు వెళ్లిందని పుకార్లు షికార్లు చేశాయి. వీళ్ల సంబంధంపై షారుఖ్ భార్య గౌరీ అతనికి వార్నింగ్ కూడా ఇచ్చిందని బాలీవుడ్ జనాలు చర్చించుకున్నారు. అనేక సందర్భాల్లో గౌరీ బహిరంగంగానే ప్రియాంకపై తన కోపాన్ని పరోక్షంగా వెల్లగక్కింది. 



మరో వైపు ఎప్పుడూ శాంత స్వభావంతో కనిపించే దర్శకుడు కరణ్ జోహార్ కూడా ప్రియాంకపై విమర్శలు చేయడం సర్వత్రా చర్చీనీయాంశం అయింది. కొందరు ఆత్మాభిమానం లేకుండా వ్యవహరిస్తుంటారు అంటూ పరోక్షంగా ప్రియాంకను టార్గెట్ చేశాడు కరణ్. షారుఖ్-ప్రియాంక వ్యవహారంలోనే అతను ఇలా స్పందించాడని అంటున్నారు. మరో వైపు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి వారు ఈ భామను ఎప్పుడో పక్కన పెట్టేశారు. ఇకపై ఆమెకు షారుఖ్ తో నటించే అవకాశం కూడా రాకపోవచ్చు.



ఇటీవల ఐపీఎల్ 5 ఓపెనింగ్ సెర్మనీలో కూడా ప్రియాంక ఓవర్ చేసిందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆమెకంటే కరీనా పెర్ఫార్మెన్సే బాగుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ పరిణామాలకు తోడు, ప్రియాంక సినిమాలన్నీ ప్లాపులవుతుండటం ఆమె కెరీర్ డేంజర్లో పడుతుందనడానికి సంకేతాలు అనే వార్తలు వినిపిస్తున్నాయి.


Posted by Andhra Gossips on 12:32. Filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips