యూ ట్యూబ్ లో ‘ఈగ’ హల్ చల్
ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్.రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఈగ’, నాని, సమంత, సుదీప్ ముఖ్య పాత్రల్లో, తెలుగు తెరపై భారీ గ్రాఫిక్స్ వర్క్‌తో వారాహి చలనచిత్రం పతాంకపై వస్తోంది. ఈ సినిమా ఆడియో ఇటీవలె విడుదలయింది. అయితే ‘ఈగ’ ట్రైలర్ యూట్యూబ్‌లో పెద్ద దుమారాన్నే రేపుతుంది. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం వివిధ చిత్రాల ట్రైలర్స్ పరిశీలిస్తే గబ్బర్‌సింగ్ 4,68,000 (30 రోజులకు), రచ్చ 5,03,000, (21 వారాలకు), దమ్ము 3,28,000 (8 రోజులకు) క్లిక్స్‌ని సాధించగా…రాజమౌళి ఈగ కేవలం 7 రోజుల్లో 5,63,00క్లిక్స్‌ని సొంతం చేసుకుని సోషల్ నెట్‌వర్క్ సైట్ లలో కొత్త రికార్డు సాధించింది.
కీరవాణి సంగీతం ప్రధాన ఆకర్షణగా రూపు దిద్దుకున్న ఈ చిత్రం విడుదల తర్వాత మరెన్ని రికార్డులు సాధిస్తుందో. నాని, సుదీప్, సమంతా తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: సెంథిల్‌కుమార్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్స్: ఎస్.రవీందర్, స్టైలింగ్: రమా రాజమౌళి, సమర్పణ: డి.సురేష్‌బాబా, ప్రొడ్యూసర్ :సాయి కొర్రపాటి, కథ, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి
