Priyanka Chopra Beats Sachin's Record
Yes, you have read it right! Priyanka chopra has broken Sachin Tendulkar's record. No, we are not talking about cricket here. We are talking about Twitter. Priyanka has the highest numbers of followers on Twitter with 2,228,363, which is more than the followers of Sachin Tendulkar (2,208,617).
మీరు విన్నది నిజమే. సచిన్ రికార్డును హాట్ హీరోయిన్ ప్రియాంక చోప్రా బద్దలు కొట్టింది. మేం మాట్లాడేది క్రికెట్లో సచిన్ రికార్డుల గురించి కాదు. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ గురించి. ప్రియాంక ట్విట్టర్లో అత్యంత ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీగా కొత్త రికార్డు నమోదు చేసింది. గతంలో ఈ రికార్డు 22,08,617 మందితో సచిన్ పేరు మీద ఉండేది. తాజాగా ప్రియాంక చోప్రా 22,28,363 మంది పాలోవర్స్‌తో సచిన్‌ను బీట్ చేసింది.
మరో వైపు ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో అత్యంత ఎక్కువ మంది అభిమానులు ఉన్న బాలీవుడ్ స్టార్‌గా సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో ప్రియాంక మొదటి స్థానంలో ఉండగా, శశిథరూర్ నెం.2 పొజిషన్లో ఉన్నారు. బాలీవుడ్ మోగాస్టార్ అమితాబ్ బచ్చన్ నెం.3 స్థానంలో ఉన్నారు. మొత్తం 100 మందితో కూడిన ఈ జాబితాలో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇలా చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు.
ఇక ప్రియాంక వ్యక్తిగత విషయాలకొస్తే....మీ పెళ్లి ఎప్పుడు? అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అడగ్గా...నాకు ఈడు జోడు అయిన మంచి మగాడు దొరకాలిగా అంటోంది. అంతే కాదు... అతను ఎప్పుడు దొరికితే, అప్పుడే పెళ్లి అంటూ తేల్చి చెప్పింది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందుతున్న ‘బర్ఫీ’ చిత్రంలో నటిస్తోంది.
మరో వైపు ఆమె నటించిన తేరీ మేరీ కహానీ చిత్రం కూడా విడుదలకు సిద్ధం అవుతోంది. మరో వైపు క్రిష్-3 చిత్రంలోనూ ప్రియాంక హీరోయిన్‌గా ఎంపికైంది. ప్రియాంక ఇటీవల నటించిన డాన్ 2 చిత్రం ఓ మోస్తరు విజయం సాధించింది. అగ్నిఫథ్ సినిమా మంచి విజయం సాధించినా...ఈ రెండు చిత్రాల్లోనూ ఆమె పాత్రకు సరైన గుర్తింపు రాలేదు. దీంతో హీరోయిన్ల రేసులో కరీనా, కత్రినా లాంటి వారితో వెకబడి పోయింది.
