|

Pawan Kalyan Rumour is Real

The core team of Jalsa (2008) is coming together again for a new film. Pawan Kalyan and director Trivikram will be starting another romantic entertainer from this October. And Ileana has been roped in to play the female lead opposite Pawan Kalyan as their pairing in Jalsa was a hit.


పవన్ కల్యాణ్, ఇలియానా కాంబినేషన్ లో వచ్చిన 'జల్సా'చిత్రం ఘన విజయం సాధించింది. దాంతో ఈ చిత్రం కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ మరో చిత్రం తెరకెక్కనుందంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అవి రూమర్స్ కావు నిజమని సమాచారం. పవన్ సరసన ఇలియానా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఈ సినిమాకీ త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించనున్నారు. ఊసరవెల్లి నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరిస్తారు.


ఇక ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. త్రివిక్రమ్‌, పవన్‌కల్యాణ్‌లు వారి వారి సినిమాలతో బిజీగా ఉన్నారు. అక్టోబరులో ఈ కొత్త సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇలియానా ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన త్రివిక్రమ్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న చిత్రం లో చేస్తోంది. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సైతం స్పీడుగా విడుదలకు సిద్దమవుతోంది. ఇక నిర్మాత బివియస్ ఎన్ ప్రసాద్..రిలియన్స్ గ్రూప్ ఫైనాన్స్ తో వరస ప్రాజెక్టులతో ముందుకు వెళ్తున్నారు. కాంబినేషన్ రిపీట్ అయితే లాభ నష్టాలు మాట ఎలా ఉన్నా టేబుల్ ప్రాఫెట్స్ కు లోటు ఉండదని భావిస్తున్నారు.



మరో ప్రక్క ఇలియానా బాలీవుడ్‌లో తన స్థానాన్ని క్రమంగా మెరుగుపర్చుకొంటోంది. ఈ గోవా భామ ప్రస్తుతం 'బర్ఫీ', 'కిలాడీ 786' సినిమాల్లో నటిస్తోంది. ఇప్పుడు ఆమె ఖాతాలో మరో సినిమా కూడా చేరింది. తమిళ చిత్రం 'వెట్త్టె'ని హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో షాహిద్‌కపూర్‌ హీరో. ఆయన సరసన ఇలియానాని హీరోయిన్ గాఎంచుకొన్నారు.



ఇటు తెలుగులోనూ మెల్లిమెల్లిగా ఇలియానా బిజీ అయ్యే వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతం తెలుగులో రెండు చిత్రాలు చేస్తోంది. జులాయి లో చేస్తున్న ఈ భామని త్రివిక్రమ్ మళ్లీ పవన్ తో చేయటానికి ఒప్పించారని తెలిసిందే. త్వరలో పవన్‌తో మరోసారి నటించేందుకు అంగీకరించినట్లు తెలిసింది. హిందీ సినిమాల గురించి మాట్లాడుతూ...నా తొలి హిందీ చిత్రం 'బర్ఫీ' విడుదల కాక ముందే మరిన్ని అవకాశాలు అందుకోవడం ఆనందంగా ఉంది. ఇక ఏ భాషలో నటించినా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడమే లక్ష్యం అని ఇలియానా చెబుతోంది.


Posted by Andhra Gossips on 03:48. Filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips