Rajamouli in Top of Summer Race
సూపర్ సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా , పట్టుదలగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఈగ’. నాని, సమంత, సుదీప్ ముఖ్య పాత్రల్లో, తెలుగు తెరపై నెవర్ బిఫోర్ అనిపించే గ్రాఫిక్స్ వర్క్‌తో వారాహి చలనచిత్రం పతాకంపై ఓ విజువల్ వరండ్‌గా రూపొందుతున్న ‘ఈగ’పై ఇప్పటికే ఇటు ఇండస్ట్రీలోనూ, అటు ఆడియెన్స్ లోనూ స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేటై ఉంది. ఈ నేపథ్యంలో ‘ఈగ’ ట్రైలర్ యూట్యూబ్ లో పెద్ద దుమారాన్నే రేపుతుంది.
ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం టాప్ హీరోల చిత్రాలైన ట్రైలర్స్‌లో గబ్బర్ సింగ్ 4,68,000(నెల రోజులకు), రచ్చ 5,03,000(3 వారాలకు), దమ్ము 3,28,000(8 రోజులకు) క్లిక్స్ ని సాధించగా..రాజమౌళి ఈ గ కేవలం 7 రోజుల్లోనే 5,63,000 క్లిక్స్ సొంతం చేసుకుని సోషల్ నెట్ వర్క్ సైట్‌లను షేక్ చేస్తూ...దూసుకెలుతోంది.
కీరవాణి సంగీతం ప్రధాన ఆకర్షణగా రూపుదిద్దుకున్న ఈచిత్రం విడుదల తర్వాత మరెన్ని సంచలనాలకు దారి తీస్తుందో..అని ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. నాని, సుదనీప్, సమంత తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎం. కీరవాణి, సినిమాటోగ్రఫీ : సెంథిల్ కుమార్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ష్ : ఎస్. రవీందర్, స్టైలింగ్ : రమా రాజమౌళి, సమర్పణ : డి. సురేష్ బాబు, ప్రొడ్యూసర్ : సాయి కొర్రపాటి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : ఎస్. ఎస్. రాజమౌళి.
