Ileana With Play Boy
గోవా సుందరి ఇలియానా అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందుతున్న ‘బర్ఫీ’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా మెయిన్ హీరోయిన్ కాగా, ఇలియానా సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజాగా ఇలియానాకు మరో బాలీవుడ్ అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ ఇలా తరచూ లవర్లను మారుస్తూ ప్లేబాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న షాహిద్ కపూర్ సరసన హీరోయిన్‌గా ఇలియానాకు నటించే అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.
లింగుస్వామి తమిళంలో రూపొందించిన ‘వెట్టై’ చిత్రం మంచి విజయం సాధించిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని హిందీలో ప్లాన్ చేస్తున్నారు. తమిళ వెర్షన్లో మాధవన్, ఆర్య, సమీరారెడ్డి, అమలపాల్ ముఖ్య పాత్రల్లో నటించారు. హిందీ వెర్షన్లో ఆర్య పాత్రకు షాహిద్ కపూర్‌ను హీరోగా, అతనికి జోడీగా అమలపాల్ జాత్రలో ఇలియానాను తీసుకోన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం ఇలియాన తెలుగులో రవితేజ సరసన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రంతో పాటు, త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ సరసన ‘జులాయి’ చిత్రం చేస్తోంది.
మరో వైపు ‘వెట్టై’ చిత్రం ‘భలే తమ్ముడు’ పేరుతో తెలుగులో అనువాదం అవుతోంది. మాధవన్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆర్య మాధవన్ తమ్ముడి పాత్రలో నటించాడు. సమీరారెడ్డి, అమలపాల్ అక్క చెల్లుల్లుగా కనిపిస్తారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం మంచి అసెట్ గా నిలిచింది. యుటివి సంస్థ తరుపున జి.ధనుంజయన్, ఎస్.పి.శివప్రసాద్ ‘భలే తమ్ముడు’ చిత్రాన్ని సమ్మర్లో విడుదల చేయనున్నారు.
