Two Iron Legs Became Golden Legs
అక్షయ్ కుమార్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన 'రౌడీ రాథోడ్' సినిమా ఇటీవలే విడుదలై మంచి హిట్ సాధించింది. రవితేజతో రాజమౌళి తీసిన విక్రమార్కుడు చిత్రాన్ని హిందీ రౌడీ రాథోడ్‌గా తీశారు. రూ. 45 కోట్లతో రూపొందిన ఈ సినిమా రెండురోజుటలకే 30 కోట్ల వరకు వసూలుచేయడం రికార్డ్.
అక్షయ్ సరసన సోనాక్షి సిన్హా నటించింది. ఈమెకు గత కొంతకాలంగా పెద్ద హిట్‌లు లేవు. ఈ సినిమా హిట్‌తో ఒక్కసారిగా శత్రుఘ్న సిన్హా కూతురు గోల్డెన్ లెగ్ అయింది. టాలీవుడ్‌లో కమల్ కుమార్తె శ్రుతి హాసన్‌కూడా 'గబ్బర్‌సింగ్'లో ఒక్కసారిగా గోల్డెన్ లెగ్ అయినట్లే ఈమెకు పేరు రావడంతో ఇండస్ట్రీలో ఐరన్‌లెగ్‌లు ఎవ్వరూ శాశ్వతం కాదని నిరూపించారు.
