Upasana Trying to Reduce Her Weight
మెగా తనయుడు, తన ప్రియుడు రామ్ చరణ్ తో వివాహానికి సిద్ధమవుతున్న అపోలో ప్రతాపరెడ్డి మనవరాలు ఉపాసన కామినేని ప్రస్తుతం స్లిమ్ అయ్యే ప్రయత్నంలో ఉంది. హెవీ పర్సనాలిటీ అయిన ఉపాసన పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుండటంలో నాజూకు తీగలాగా అయ్యి అందరినీ ఆశ్చర్యపరచాలని డిసైడయ్యిందని సమాచారం. ఇందు కోసం ప్రతి రోజు జిమ్మకు వెళ్లి వెయిల్ లాస్ కు సంబంధించిన కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. గత రెండు నెలలుగా ఆమె ఈ ప్రయత్నం లో ఉందని సమాచారం. ఇందుకోసం ఆమె తన ఫ్రెండ్ లక్ష్మణ్ రెడ్డి సహకారం తీసుకొంటోంది. 2010 మిస్టర్ వరల్డ్ గా నిలిచిన ఇతడు ప్రముఖులందరికీ బాడీ ట్రైనర్ గా ఉన్నాడు. ఇప్పు డు ఉపాసనతో స్నేహం కొద్దీ ఆమె ఫిజిక్ సరైన రీతిలో రావడానికి సూచనలిస్తున్నాడు. దీనికి ప్రతిగా ఉపాసన లక్ష్మణ్ కు బాలీవుడ్ సినిమాలో అవకాశం ఇప్పించింది. అది తనకు కాబోయే భర్త రామ్ చరణ్ ‘జంజీర్’ లో…ఈ సినిమాతో లక్ష్మణ్ బాలీవుడ్, సినిమాలకు పరిచయం కానున్నాడు. ‘ఆమె చాలా అంకిత భావం గల వ్యక్తి, ఒకవైపు హాస్పిటల్స్ వర్క్స్ చూసుకొంటూనే, జిమ్ కు కూడా సమయం కేటాయిస్తోంది. చాలా స్పోర్టివ్ , యాక్టివ్ గా ఉండే ఉపాసన అప్పుడు స్లిమ్ అవుతోంది…’ అని మరో ట్రైనర్ కిరణ్ అన్నాడు. వీరిద్దరి సేవలకు మెచ్చిన ఉపాసన…తమ అపోలో హాస్పిటల్స్ లో జిమ్ మెయింటెనెన్స్ ను కూడా అప్పజెప్పింది. దీని వారు మాట్లాడుతూ ఈ అవకాశంతో తాము ఆశ్చర్యపోయామని, ఎంతో ఆనందగా కూడా ఉందని అన్నారు.
