బిపాసా బసు ‘లేడీ గుండా’
బాలీవుడ్ హాట్ బ్యూటీ బిపాసా బసు ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు. అనామక మోడల్ గా కెరీర్ ప్రారంభించిన బిప్ప్ ఈ స్థాయికి ఎదగడానికి కారణం ఆమెలోని ధైర్యమే. అలా ఉండబట్టే బాలీవుడ్ తెరపై భయం, సిగ్గు అనేది లేకుండా ఇటు యాక్టింగ్ లోనూ, అందాల ఆరబోతలోనూ ఇరగ దీస్తోంది. ఈ ధైర్యం బపాసలో చిన్నతనం నుంచే ఉందట. ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో బిప్స్ మాట్లాడుతూ...నన్ను స్కూళ్లో అంతా ‘లేడీ గుండా’ అని పిలిచే వారు అని చెప్పుకొచ్చింది.
కాలేజీ రోజుల్లో తనను ఎవరైనా ఆట పట్టిస్తే వారిని ఓ చూపు చూసే వరకు వదిలేది కాదట, ఇక ఈవ్ టీజింగ్ లాంటి చేస్తూ తనను ఇరిటేట్ చేస్తున్న వారిని తన దైన శైలిలో హ్యాండిల్ చేస్తూ వారికి మూడు చెరువుల నీళ్లు తాగించేదట. అందుకే కొన్ని సందర్భాల్లో గుండా గిరి ప్రదర్శించకుంటే కుదరదుఅని చెబుతోంది ఈ భామ.
ప్రస్తుతం బిపాసా ప్లేయర్స్, జోడి బ్రేకర్స్, రాజ్ 3డి, రేస్ 2 చిత్రాల్లో నటిస్తోంది. ఇక ఆమె వ్యక్తిగత విషయాలపై దృష్టి పెడితే ఇటీవలే తన మాజీ లవ్వర్ జాన్ అబ్రహంతో విడిపోయిన బిపాస, కొత్త తోడును వెతుక్కనే పనిలో ఉంది. మన తెలుగు హీరో రాణా బిపాసాతో ‘సం’బంధం నడిపిస్తుందనే గుసగుసలు కూడా బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.
