|

లక్ష్మి నరసింహ గా సంజయ్ దత్


తెలుగు లో హిట్ అయిన సినిమా లను బాలీవుడ్ హీరోలు యిట్టె ఎగురేసుకుపోతున్నారు. ఇప్పటికే పోకిరి వంటి సినిమాలు హిందీ స్క్రీన్ ను ఓ ఊపు ఊపుతుంటే తాజాగా సంజయ్ దత్ కూడా తయారైయ్యాడు. తెలుగు లో బాలకృష్ణ నటించిన లక్ష్మి నరసింహ సినిమాను సంజయ్ దత్ హిందీ లో చేయనున్నారు. దీనికి సంబంధించిన హక్కులను తమిళ నిర్మాత దగ్గర కొన్నారు. నిజానికి తమిళం లోనే ఈ సినిమా సామి పేరుతో హిట్ అయింది. తరువాతే తెలుగులో లక్ష్మి నరసింహ పేరుతో బాలకృష్ణ చేశారు. సంజయ్ దత్ నటించే ఈ సినిమాకు తమిళ దర్శకుడు కే.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తారు. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

Posted by Andhra Gossips on 08:51. Filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips