‘కొలవెరి’పాటకు తమన్నా డాన్స్
రీసెంట్ గా ధనుష్ పాడిన ‘కొలవెరి...’పాట ఏ రేంజిలో కుర్రకారుని ఊపేస్తోందో తెలిసిన విషయమే. ఈ పాట పిచ్చి తమన్నాకు కూడా పట్టినట్లుంది. తాజాగా ఆమె పుట్టిన రోజు వేడుకల్లో ఆమె ఈ పాటకు డాన్స్ చేసింది. ఈ నెల 21న తమన్నా పుట్టినరోజు వేడుక చెన్నయ్‌లో ఘనంగా జరిగింది. అప్పుడు జరిగిన పార్టీలో ‘కొలవెరి’ పాటను ధనుష్ పాడగా తమన్నా తనదైన శైలిలో అందంగా స్టెప్పులేశారు. శ్రుతిహాసన్, పూనమ్‌భజ్వా, ఇలియానా తదితర అందమైన భామలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని సమాచారం. తమన్నా స్టెప్స్‌ని వారంతా విపరీతంగా ఎంజాయ్ చేశారు.తమన్నాకు ఇప్పడున్నీ హ్యాపీడేసే నడుస్తున్నాయి. ఎక్కడెక్కడి ఆఫర్స్ ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి.
తమన్నా ప్రస్తుతం రచ్చ,ప్రభాస్ సినిమా రెబెల్ చేస్తోంది. అలాగే రామ్ తో ఎందుకంటే ప్రేమంటే చిత్రం కూడా చేస్తోంది. కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎందుకంటే ప్రేమంటలో ఆమె హీరోయిన్ గా చేస్తోంది. 'కందిరీగ' తర్వాత హీరోగా రాం నటిస్తున్న సినిమా 'ఎందుకంటే.. ప్రేమంట!'. రాం సరసన తొలిసారిగా తమన్నా నటిస్తున్న ఈ సినిమాకి ఎ. కరుణాకరన్ డైరెక్టర్. 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'డార్లింగ్' వంటి హిట్ సినిమాల తర్వాత కరుణాకరన్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇదే. ఆమె ఎంత బిజీ అయ్యిపోయిందంటే ఆమె డేట్స్ ఇబ్బంది అవుతున్నాయంటూ ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ చేసేటంతగా. ఊసరవెల్లి,బద్రీనాధ్ నెగిటివ్ రిపోర్టులు ఆమె కెరీర్ పై అస్సలు ప్రభావం చూపకపోవటం విశేషం.
