|

Aishwarya Rai Abhishek Bachchans Daughter's Name

Aishwarya Rai Daughter Name

అందాల తార ఐశ్వర్యరాయ్ కూతురుకు ఏం పేరు పెడతారో..? అంటూ దేశంలోని ఆమె అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఐశ్వర్య కూతురు పుట్టిన గడియలు, జాతకాన్ని బట్టి ఆమె పేరు ‘కె’ అక్షరంతో మొదలువుతుందని మొదట్లో ప్రచారం జరిగినప్పటికీ ఐష్-అభిల ఆలోచన మాత్రం వేరేలా ఉంది. తాజాగా బాలీవుడ్ నుంచి అందిన సమాచారం ప్రకారం AA అక్షరాలతో మొదలయ్యేలా పేరు ఉంటుందని అంటున్నారు. 


ఐశ్వర్య దంపతులు AA అని ఆలోచించడం వెనక పెద్ద కారణమే ఉంది. ఐశ్వర్య, అభిషేక్, అమితాబ్ ఇలా కుటుంబంలోని వారి పేర్లన్నీ A అక్షరంతోనే మొదలవుతుండటం, AA అని పెడితే జాతక పరంగా కూడా ఐశ్వర్య కూతురుకు కలిసొస్తుందని బచ్చన్ కుటుంబం బలంగా నమ్ముతోందని అంటున్నారు. త్వరలోనే పేరును ఖరారు చేసి సోషల్ నెట్వర్కింగ్ ద్వారా అభిమానులకు, మీడియాకు తెలియజేసే అవకాశం ఉంది.



నవంబర్ 16, 2011న ఐశ్వర్య పండంటి బిడ్డకు జన్మనివ్వడం, ప్రస్తుతం ఆమెను ‘బేటి బి’ అని ముద్దుగా పిలుచుకుంటున్న విసయం తెలిసిందే. ఇప్పటి వరకు ఐశ్వర్య కూతురు మీడియా కంట పడలేదు. సరైన సమయంలో బేటి బి ఫోటోలను మీడియాకు విడుదల చేస్తామని బచ్చన్ కుటుంబ సభ్యులు అంటున్నారు.

Posted by Andhra Gossips on 04:54. Filed under , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips