Businessman 2 is Coming : Puri Jagan
'బిజినెస్ మ్యాన్ 2' ప్రకటించిన పూరీ జగన్నాధ్
మహేష్ తో తాను రూపొందించిన బిజినెస్ మ్యాన్ చిత్రం రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతూండటంతో పూరీ ఈ చిత్రం సీక్వెల్ చేస్తానని ప్రకటించారు. ఆయన ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ... మేము త్వరలోనే ఈ చిత్రం సీక్వెల్ చేస్తాను. అందులోనూ మహేష్ బేబే హీరోగా ఉంటాడు. ఈ సంవత్సరం చివరకల్లా ఈ చిత్రం ప్రారంభిస్తాను అన్నారు. ఇక బిజినెస్ మ్యాన్ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా సూపర్ హిట్టైంది. టైటిల్ కు తగ్గట్లుగా బిజినెస్ చేస్తోంది. మహేష్ ని నిజమైన బిజినెస్ మ్యాన్ గా సంభోదిస్తున్నారు.
ఇక నిర్మాత ఆర్ వెంకట్ కూడా తాము నిర్మించిన చిత్రాల్లో హైయిస్ట్ కలెక్టు చేసిన చిత్రం ఇదే కావటంతో చాలా హ్యాపీ ఫీలవుతున్నారు. కాజల్,మహేష్ కాంబినేషన్ లో రూపొందిన బిజినెస్ మ్యాన్ చిత్రం రెండు వేల ధియోటర్స్ లో సంక్రాంతి కానుకగా విడుదల చేసారు. మొదటి వారం మొత్తం సినిమా విడుదలకు ముందే చాలా చోట్ల టిక్కెట్లు బుక్కై మహేష్ స్టామినా ఏమిటనేది చూపించాయి. సూపర్ స్టార్ గా మహేష్ ని ఈ చిత్రం పూర్తి స్ధాయిలో ఎలివేట్ చేసి నిలబెట్టిందని ట్రేడ్ సర్కిల్స్ లో చెప్తున్నారు.
