|

Intresting Story about Rajinikanth in Internet



Bahadur says Rajini’s simplicity is evident: ‘When he comes to see me, we drink the same old rum with egg-laced delicacies from my sister who lives one floor below mine. When it is bed time, he sleeps on the floor without any complaints.”

ఇంటర్నెట్‌లో రజనీ గురించిన ఆసక్తికర స్టోరీ

సూపర్ స్టార్ రజనీ గురించి ఇంటర్నెట్ లో ఓ ఆసక్తికరమైన స్టోరీ చక్కర్లు కొడుతోంది. పక్క ఫోటో చూశారుగా. ఇతను రజనీకాంత్ పాత స్నేహితుడు బహదూర్. రజనీకాంత్ కర్నాటక టాన్స్‌పోర్ట్ సర్విస్‌లో కండక్టర్ గా పని చేసేప్పుడు ఇద్దరు స్నేహితులు. రజనీది కండక్టర్ ఉద్యోగం అయితే అతనిది డ్రైవర్ ఉద్యోగం. అప్పట్లో చామరాజ్ పేటలో బహుదూర్ సింగిల్ రూమ్ లో నివాసం ఉండే వాడు. రజనీ, బహదూర్ కలిసి అక్కడే అప్పుడప్పుడు మందు కొట్టేవారట. రజనీకాంత్ ఇప్పటికీ తన స్నేహితుడిని కలిసేందుకు అక్కడి వెలుతుంటాడు. ఇప్పటికీ వారు కలిసినప్పుడు అదే ప్లేసులో కూర్చుని అప్పడు తాగిన సేమ్ బ్రాండ్ రమ్ సేవిస్తుంటారట. పక్కడ కోడి గుడ్డుతో చేసిన మంచింగ్‌తో పాటుగా..


రజనీ సింప్లిసిటీ గురించి బహదూర్ వివరిస్తూ...అప్పుడప్పడు రజనీ సడన్‌గా తర వద్దకు వస్తుంటాడని, అప్పుడు ఎలా నిరాడంబరంగా ఉన్నాడో, ఇప్పటికీ అలాగే నిరాడంబరంగా ఉంటాడని, రాత్రి పడుకున్న తర్వాత కూడా తనతో పాటు నేలపైనే పడుకునే వాడని బహదూర్ షా చెప్పుకొచ్చారు. ఎంత ఎత్తుకు ఎదిగినా...తన వాళ్లని, స్నేహితులను మరువ కూడదనే కాన్సెప్టునే రజీనీ ఇప్పటి వరకు జీవిస్తున్నారని, క్రమశిక్షణతో, ఆదర్శ భావాలతో జీవించబట్టే రజనీ ఈ వయసులోనే హీరోగా రాణిస్తున్నాడు. 30 రూపాలయ జీతం నుంచి రూ. 30 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగాడని, అతను గొప్ప స్నేహితుడు, మానవత్వ విలువలు తెలిసన వాడు అంటూ తన స్నేహితుడి గురించి చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యారు బహదూర్. రజనీ కూడా ఎన్నోసార్లు తన స్నేహితుడు బహుతూర్ గురించి చెప్పిన విషయం తెలిసిందే.

Posted by Andhra Gossips on 20:32. Filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips