Businessman Producers are Silent of Dookudu's Result
Producers of The Businessman have publicized the number of theaters the film has been released in and not its collections, at least on the opening day.
ఫ్యాన్స్ ను నిరాశపరుస్తున్న'బిజినెస్ మ్యాన్'
మహేష్ తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ కలెక్షన్స్ అదిరిపోతున్నాయంటూ మీడియాలో వినపడుతున్న సంగతి తెలిసిందే. అయితే అఫీషియల్ గా ఎక్కడా నిర్మాతలు ఈ కలెక్షన్స్ గురించి మాట్లాడటం లేదు. దానికి కారణం దూకుడు కలెక్షన్స్ ప్రకటించి టాక్స్ సమస్యలు తెచ్చుకోవటమే కారణం అంటున్నారు. కలెక్షన్స్ అంత వచ్చాయి..ఇంత వచ్చాయి అని చెప్పటం ద్వారా ఎసిబి దాడులు తప్ప ప్రత్యేకంగా ఒరిగేమీ లేదంటున్నారు. అయితే అభిమానులు మాత్రం నిర్మాతలు పై గుర్రుగా ఉన్నారు. తమ హీరో సినిమాకు వచ్చిన కలెక్షన్స్ చెప్పుకోవటం,అవి ఏ ఇతర సినిమాను క్రాస్ చేసిందో చెప్పుకోవటం వారు సంతోషంగా భావిస్తారు.
అయితే ఇప్పుడు నిర్మాతలు సైలెంట్ గా ఉండటంతో ఫ్యాన్స్ కు నిరాశే కలిగిస్తోంది. కేవలం రెండు వేల ధియోటర్స్ లో విడుదల చేసారు అన్నది తప్ప వేరే ఏ విషయం నిర్మాతలు తెలియచేయటం లేదు. అయితే మహేష్ బాబు,పూరీ మాత్రం తమ దైన శైలిలో ట్విట్టర్ ద్వారా ఈ చిత్రానికి ప్రచారం కల్పిస్తున్నారు. ఈ చిత్రం అద్బుతమైన సక్సెస్ తెచ్చిపెట్టిందని వారు ట్వీట్ చేసి ఆనందపరుస్తున్నారు. ఇక వెంకటేష్ బాడీగార్డ్ చిత్రం కూడా మంచి ఓపినింగ్స్ రాబట్టినప్పటికీ వారూ కలెక్షన్స్ విషయాలు బయిటపెట్టడం లేదు.
