|

Businessman Area Wise Collections


Critics and a section of audience may have given thumbs down to Mahesh Babu starrer The Businessman but it has not made much-difference, as the Telugu movie has made record-breaking collections on the first day.

బిజినెస్‌ మేన్ ఏరియావైజ్‌ కలెక్షన్స్(అఫీషియల్)


మహేష్ బాబు, కాజల్ జంటగా...పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘బిజినెస్ మేన్’ సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజైన్ సంగతి తెలిసిందే. తెలుగు సినిమా చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి అత్యధిక థియేటర్లలో సినిమాను విడుదల చేశారు. మొదటి నుంచి సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో కలెక్షన్ల వర్షం కురిసింది. ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో దాదాపు ఇదే రికార్డు స్థాయి కలెక్షన్లు అంటున్నారు. ఈ సినిమాను నిర్మించిన ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సంస్థ ఫస్ట్ డే కలెక్షన్ల వివరాలను ఓ ప్రకటనలో వెల్లడించింది. మొదటి రోజు కలెక్షన్ గ్రాస్ రూ.18.73 కోట్లు కాగా షేర్ రూ.13.78 కోట్లుగా ఉందని పేర్కొంది. ఈ వివరాలను తెలుగు మీడియా ప్రముఖంగా ప్రచురించింది.

ఏరియాల వారిగా షేర్ వివరాలు
నైజాం : రూ.3.04 కోట్లు
సీడెడ్‌ : రూ.2.01 కోట్లు
కృష్ణా : రూ.55.21 లక్షలు
గుంటూరు : రూ.1.03 కోట్లు
నెల్లూరు : రూ.35.17 లక్షలు
వెస్ట్ గోదావరి : రూ.55.73 లక్షలు
ఈస్ట్ గోదావరి : రూ.75.05లక్షలు
వైజాగ్‌ : రూ.73.48 లక్షలు
ఓవర్సీస్(యు.ఎస్, యు.కె., జపాన్, ఆస్ట్రేలియా) రూ.3 కోట్లు
కర్ణాటక : రూ.కోటి
తమిళనాడు, ఒరిస్సా, నార్త్ ఇండియా : రూ.75 లక్షలు


Posted by Andhra Gossips on 22:14. Filed under , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips