|

Sharuk Khan and Aish with Muragadaas


బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్-స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కాంబినేషన్లో సినిమా రాబోతోందా? ఈ చిత్రానికి దక్షిణాది పాపులర్ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహించబోతున్నారా? అంటే అవును అనే వార్తలు వినిపిస్తున్నాయి బాలీవుడ్ వర్గాల నుంచి. 

2002లో విజయ్‌కాంత్-సిమ్రన్ జంటగా మురుగదాస్ దర్శకత్వంలో విడుదలైన తమిళ మూవీ ‘రమణ’ అప్పట్లో భారీ విజయం సాధించింది. యాంటీ కరప్షన్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందించారు. ఈ చిత్రాన్ని తాజాగా హీందీలో రీమేక్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. 

సంజయ్ లీలీ బన్సాలీ చిత్రం రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారని, దేశ వ్యాప్తంగా అవినీతి వ్యతిరేక ఉద్యమం జోరుగా సాగుతున్న నేపథ్యంలో షారుఖ్ ఖాన్ కూడా ఈ చిత్రం చేయడానికి ఆసక్తి చూపుతున్నాడని అంటున్నారు. బన్సాలీ ఐశ్వర్యతో ఈ సినిమా చేయడానికి ఒప్పించారనే ప్రచారం సాగుతోంది. డెలివరీ అయిన తర్వాత కోలుకుంటున్న ఐశ్వర్య మరో ఆరు నెలల తర్వాత ఈ సినిమాపై దృష్టి పెట్టే అవకాశం ఉందట.


Posted by Andhra Gossips on 02:09. Filed under , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips