Ajith's Billa 2 Coming in Telugu
Ajith starrer Billa 2 the prequel to blockbuster Billa, being directed by Chakri Toleti will be dubbed into Telugu later.
అజిత్ హీరోగా గతంలో తమిళంలో వచ్చిన ‘బిల్లా’ చిత్రం భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ హీరోగా నిర్మించిన ఈ సినిమా తెలుగు రీమేక్ పరమ ప్లాపుగా నిలిచింది. తాజాగా అజిత్ తమిళంలో నటించిన ‘బిల్లా 2’ చిత్రం కూడా తెలుగులో రాబోతోంది.
గతంలో తెలుగులో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘బిల్లా’ రీమేక్ ప్లాప్ అయిన నేపథ్యంలో..ఈ సారి రీమేక్ జోలికి పోకుండా తమిళ ‘బిల్లా2’ చిత్రాన్నే తెలుగులో అనువదించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చక్రి తోలేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పార్వతి ఓమన కుట్టన్, బ్రూనా అబ్దుల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. మే 1న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
గతంలో తెలుగులో బిల్లా సినిమా ప్లాప్ అయిన నేపథ్యంలో బిల్లా 2 చిత్రం తెలుగు అనువాదంపై ఇక్కడి సినీ వర్గాల్లో పెద్దగా ఆసక్తి లేకుండా పోయింది. అజిత్ ఇటీవల తమిళంలో నటించిన ‘మన్ కథా’ సినిమా తెలుగులో గేంబ్లర్ గా విడుదలైంది. తమిళంలో మన్ కథా భారీ విజయం సొంతం చేసుకుంటే తెలుగు గేంబ్లర్ మాత్రం ప్లాపయింది.
