Adhinayakudu Makers Rejects Allu Aravind
Adhinayakudu are reluctant to sell the rights to Aravind because of early commitments. Freshly, Aravind has acquired the Chittoor district rights of the movie for a fancy price from popular distributor and producer NV Prasad.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు నందమూరి బాలకృష్ణ నటించిన ‘అధినాయకుడు’ సినిమా నిర్మాతలు షాక్ ఇచ్చినట్లు సమాచారం. సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం అధినాయకుడు సినిమా థియేట్రికల్ హక్కులను దక్కించుకోవడానికి అరవింద్ చాలా ట్రై చేస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల నిర్మాతలు వేసిన అధినాయకుడు స్పెషల్ షో కూడా అల్లు అరవింద్ తిలకించారని సమాచారం.
అయితే నిర్మాతలు మాత్రం అరవింద్‌కు థియేట్రికల్ హక్కులు ఇవ్వడానికి తిరస్కరించారని తెలుస్తోంది. అంతకు ముందుగానే ఈ సినిమాను వేరే వారికి ఇచ్చేందుకు కమిట్ అయినందున ఇలా చేసినట్లు చర్చించుకుంటున్నారు. అయితే అల్లు అరవింద్ మాత్రం చిత్తూరు జిల్లా హక్కులను ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఎన్.వి.ప్రసాద్ ద్వారా ఫ్యాన్సీ ధర చెల్లించి దక్కించుకున్నట్లు సమాచారం.
అధినాయకుడు చిత్రానికి పరుచూరి మురళి దర్శకత్వం వహించారు. ఎ.ఎల్. కుమార్ చౌందరి ఈ చిత్రానికి నిర్మాత. ఈ చిత్రంలో బాలయ్య మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. బాలయ్య సరసన లక్ష్మిరాయ్, సలోని నటిస్తుండగా, జయసుధ మరో ముఖ్య పాత్రను పోషిస్తోంది.
