Anil Ambani at Oscar Awards
Reliance Group chairman Anil Ambani with his Dream Works Studios co-partners Steven Spielberg and Stacey Snider at the Red Carpet of the 84th Academy Awards ceremony held at Kodak Theatre, Los Angeles on 27th February 2012.
లాస్ ఏంజిల్స్: 84వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో రిలయన్స్ డ్రీమ్ వర్క్స్ అధినేత అనిల్ అంబానీ దంపతతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆస్కార్ బరిలో రిలయన్స్ డ్రీమ్ వర్క్స్ రూపొందించిన పదకొండు చిత్రాలు నామినేట్ అయ్యాయి. హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ తో కలసి వార్ హార్స్, టేట్ టేలర్ తో ది హెల్ప్ సినిమాలను రిలయన్స్ డ్రీమ్ వర్క్స్ నిర్మించింది.
స్పీల్ బర్గ్ వార్ హార్స్ చిత్రం ఉత్తమ సౌండ్ ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్, ఒరిజినల్ స్కోర్, ఆర్ట్ డెరైక్షన్, సినిమాటోగ్రఫి శాఖల్లో నామినేట్ కాగా, ఉత్తమ చిత్ర కేటగిరిలో ది హెల్ప్, ఉత్తమ నటి వయోలా డెవిస్, ఉత్తమ సహాయ నటి జెస్సికా చాస్టెయిన్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో రియల్ స్టీల్ చిత్రాలు నామినేట్ అయ్యాయి. అవార్డుల కార్యక్రమంలో భాగంగా స్పీల్‌బర్గ్‌తో కలిసి అనిల్ అంబానీ, టీనా అంబానీలు రెడ్ కార్పెట్‌పై హుందాగా కనిపించారు.
ఇది ఇలా ఉంటే ఇదే ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఏఆర్ రెహ్మాన్ ఆటపాటతో అందర్ని ఆకట్టుకున్నారు. ఆదివారం రాత్రి జరిగిన ఓ ప్రదర్శనలో హాన్స్ జిమ్మర్ నేతృత్వంలోని ఆస్కార్ సూపర్ బ్యాండ్‌తో కలిసి రెహ్మాన్ ప్రదర్శన ఇచ్చారు. ‘127 హవర్స్’ చిత్ర ట్రాక్స్‌తో రెహ్మాన్ ప్రేక్షకుల్ని రంజింపచేశారు. 2009 సంవత్సరపు అవార్డుల్లో రెండు అస్కార్‌లను సొంతం చేసుకుని రెహ్మాన్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
