Nagarjuna Responds on His Political Entry
Hero Nagarjuna confirmed that he will not enter in to politics.
హైదరాబాద్: సినీ ఆగ్ర హీరో యువసామ్రాట్ నాగార్జున రాజకీయాలపై మరోసారి కామెంట్ చేశారు. తన రాజకీయ ఆరంగేట్రంపై జోరుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన వాటికి తెరదించే ప్రయత్నాలు చేశారు. సోమవారం హైదరాబాదులో ఓ కార్యక్రమానికి హాజరైన నాగార్జున మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రానను స్పష్టం చేశారు. కాగా రెండు రోజుల క్రితం తిరుపతిలో ఓ షోరూం ప్రారంభోత్సవానికి వెళ్లిన నాగార్జున తనకు రాజకీయాలు అంటే చాలా ఇంట్రెస్ట్ అని, వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటానని చెప్పారు. మంచి రాజకీయ నాయకులు మనకు అవసరమని చెప్పారు. అయితే తాను రాజకీయాలకు సూట్ కానని నాగార్జున చెప్పారు. తాను రాజకీయాల్లోకి రానని చెప్పారు.
అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. నాగార్జున త్వరలో రాజకీయాల్లోకి రానున్నారని, అందుకే ఆయన ఇలాంటి కామెంట్స్ చేశారని చెప్పారు. టాప్ హీరోల్లో చిరంజీవి ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారు. బాలకృష్ణ కూడా 2014 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. అదే దారిలో ఇప్పుడు నాగార్జున రానున్నారని జోరుగా ప్రచారం జరిగింది. నాగార్జున మాత్రం తాను రాజకీయాల్లోకి రానని మరోసారి స్పష్టం చేసి చర్చకు తెరదించే ప్రయత్నాలు చేశారు. అసలు నాగార్జున రాజకీయాలపై కామెంట్ చేసిన రోజే తాను రానని స్పష్టం చేసినప్పటికీ ఆరంగేట్రంపై జోరుగా చర్చ జరగడం విశేషం.
