Anuskha Dual Role in a Tamil Film
Anushka is doing dual role in her upcoming flick Irandam Ulagam.
అనుష్క త్వరలో ఓ గిరిజన యువతిగా,ఈ కాలం పాస్ట్ లైఫ్ కు చెందిన అమ్మాయిగా ద్వి పాత్రాభినయం చేయనుంది. ఈ మేరకు సబ్జెక్టుని దర్శకుడు సెల్వ రాఘవన్ వినిపించి ఓకే చేయించుకున్నాడు. భారీ బడ్జెట్ తో రూపొందే ఈ చిత్రంలో గిరిజన యువతిగా ఉండే సన్నివేశాలు హైలెట్ గా ఉండబోతున్నాయని సమాచారం. అయితే ఈ చిత్రం గతంలో రానా తో తెలుగులో అనుకున్న కథే అని తెలుస్తోంది. అయిదువేల సంవత్సరాల క్రితం కథ అది. జానపదం ,చరిత్రాత్మకం కలిసి ఉంటుంది. పూర్తి వైవిధ్యమైన చిత్రం అవుతుంది.
ఆర్య హీరోగా రూపొందే ఆ చిత్రం కోసం సెల్వ రాఘవన్ సంవత్సరం డేట్స్ అడిగాడని సమాచారం. ఇక కమల్ హాసన్ తో విస్వరూపం ప్రాజెక్టు విషయంలో క్రియేటివ్ డిఫెరెన్స్ లు రావటంతో కాదనుకున్న సెల్వ ఇప్పుడు మరోసారి తనను ఆవిష్కరించే ప్రయత్నంలో ఉన్నారు. అందుకే సూపర్ హిట్స్ ఇస్తున్న ఆర్య తోనూ, తమిళ్, తెలుగు భాషలకు సరిపడే అనూష్కతోనూ సినిమా చేయటానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ తమిళ చిత్రానికి కోలా భాస్కర్ ఎడిటింగ్ చేస్తున్నారు. సంగీతం హరీష్ జైరాజ్ అందిస్తున్నారు. కిరణ్ ఆర్ట్ వర్క్ చేస్తున్నారు. అనూష్క ప్రస్తుతం తెలుగులో కేవలం ఢమురకం చిత్రం మాత్రమే చేస్తోంది. నాగార్జున సరసన చేస్తున్న ఈ చిత్రం సోషియో పాంఠసీ గా తెరకెక్కుతోంది.
