|

Cameraman "Puri" tho Pawan Kalyan




‘బిజినెస్ మెన్’ సినిమాలో ట్యాక్సీ డ్రైవర్ గా కనిపించిన దర్శకుడు పూరి జగన్నాథ్ ఇక ఫుల్ లెంగ్త్ పాత్రలో దర్శనమిచ్చేందుకు సిద్దమయ్యాడు. బద్రి సినిమా తరువాత పవన్ కళ్యాణ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ‘కెమెరామెన్ గంతో రాంబాబు’ అనే చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో జర్నలిస్టు పాత్రలో హీరో పవన్ కళ్యాణ్ నటిస్తుండగా కెమెరామెన్ ఃగంగ పాత్రకు ఎవరిని తీసుకోవాలా ? అలోచించారు.
కొందరు యువనటులను అనుకున్న పూరి తరువాత తన తమ్ముడు సాయిరాం శంకర్ ను ఈ పాత్రలో నటింపచేయాలని అనుకున్నట్లు సమాచారం. అయితే తాననుకున్న విధంగా ఆ పాత్రలో మిగతావారు రాణిస్తారో ? లేదో ? అన్న అనుమానంతో పూరి జగన్నాథ్ ఆ పాత్ర తానే చేయాలనుకుని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సో ఇక పూరిని మనం కెమెరామెన్ గా చూడబోతున్నామన్నమాట. మరి స్వతహాగా జర్నలిస్టులను వ్యతిరేకించే పూరి ఈ చిత్రంలో కెమెరామెన్ గా ఎలాంటి సెటైర్లు వేస్తాడో వేచి చూడాలి.

Posted by Andhra Gossips on 18:10. Filed under , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips