8 Hours 8 Crores
బాలీవుడ్ లో బ్యాడ్ బాయ్ గా పేరుపడ్డ సల్మాన్ ఖాన్ వయసు పెరిగినా బాలీవుడ్ లో తన క్రేజ్ తగ్గకుండా
చూసుకుంటున్నాడు. వరుసగా హిట్ లో కొడుతున్న సల్లూభాయ్ తాజాగా ఓ యాడ్ ఫిలింలో నటించేందుకు రూ.8 కోట్లు తీసుకుని సంచలనం రేపాడు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ను కూడా ఈ విషయంలో సల్మాన్ ఖాన్ వెనక్కి నెట్టాడు.
ఇటీవల ఎనిమిది గంటల పాటు ఓ యాడ్ ఫిలింలో నటించాడు సల్మాన్ ఖాన్. క్రికెటర్ యువరాజ్ సింగ్ నటించాల్సిన ఈ యాడ్ అనుకోకుండా సల్మాన్ ఖాన్ కు దక్కింది. క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాలో ఉన్న యువరాజ్ ఇప్పట్లో వచ్చే అవకాశం లేకపోవడంతో యాడ్ ఫిలిం వారు సల్మాన్ ను తీసుకున్నారు. సల్మాన్ గంటకు రూ. కోటి అడగడంతో మారు మాట్లాడకుండా ఇచ్చేశారు.
