Controversy on "Reddy Garu Poyaru"
Andhra Pradesh Reddy's Welfare Association has warned RGV to withdraw his idea of making this movie as they feel its offending their caste. They also issued an ultimatum to RGV saying that they will object and attack the shooting of the film if he proceeds with the same title.
వివాదాలతో సావాసం చేయడం అంటే రామ్ గోపాల్ వర్మకు మహా ఇష్టం. అందుకే కాబోలు ఆయన వివాదాస్పద అంశాలపై సినిమాలు తీయడానికే ఆసక్తి చూపుతుంటారు. తాజాగా వర్మ తనకొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘రెడ్డి గారు పోయారు’ అనేది దాని టైటిల్. అయితే ఈ సినిమా టైటిల్ పై ‘రెడ్డీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ’ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వెంటనే టైటిల్ మార్చాలని వర్మకు వార్నింగ్ కూడా ఇచ్చారు. దీనిపై వాళ్లు హ్యూమన్ రైట్స్ కమీషన్‌ను సంప్రదించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి రామ్ గోపాల్ వర్మ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో..? చూడాలి.
గతంలో వర్మ నిర్మించిన ‘బెజవాడ’ సిమాతో పాటు, ‘రక్త చరిత్ర’ సినిమాపై కూడా అనేక వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా వివాదాలు ఏమీ లేక పోవడంతో మిన్నకున్న వర్మ తాజాగా వైఎస్ఆర్ మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాలపై ‘రెడ్డి గారు పోయారు’ అనే సినిమాకు ప్లాన్ చేశారు. ఇందులో వైఎస్ఆర్ మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాలను చిత్రీకరించనున్నారు.
