Nagarjuna Comments on Akhil's Entry
"Cine entry Akhil own interest, I don't interfere that" Nagarjuna told.
టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున వారసులుగా ఆయన తనయుడు నాగ చైతన్య ఇప్పటికే సినీ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన చిన్న తనయుడు అఖిల్ కూడా త్వరలో హీరోగా పరిచయం అవుతాడనే ఊహాగానాలు చాలా రోజులుగా వివిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో శనివారం ఆయన తిరుపతిలో మీడియాకు తారస పడ్డ ఆయన ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. సినిమాల్లో రావడం, రాక పోవడం అఖిల్ ఇష్టమన్నారు. తన బలవంతం ఏమీ ఉండదన్నారు. ఆధ్యాత్మిక, పౌరాణిక సినిమాలంటే ఇష్టమని చెప్పిన నాగార్జున..షిరిడి సాయి సినిమా చాలా నియమ నిష్ఠలు పాటిస్తూ చేస్తున్నానని చెప్పారు. రాజకీయాల్లో ఆసక్తి ఉందని, అయితే రాణిస్తానో లేదో తెలియదన్నారు.
నాగార్జున ఇటీవల నటించిన రాజన్న సినిమా మంచి విజయం సాధించింది. త్వరలో ఆయన నటించిన మరో చిత్రం ‘ఢమరుకం’ విడుదల కాబోతోంది. ప్రస్తుతం నాగ్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘షిరిడి సాయి’ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కర్నాటకలో జరుగుతోంది. ఇందులో నాగార్జున వేసిన సాయిబాబా గెటప్ కు ఇప్పటికే అభిమానుల నుంచి మంచి రెస్సాన్స్ వస్తోంది. గతంలోః నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామ దాసు మంచి విజయం సాధించడంతో ‘షిరిడి సాయి’ చిత్రంపైనా మంచి అంచనాలున్నాయి.
