Jr NTR With Pawan Kalyan Multi Starer Movie?
It is heard that Pawan Kalyan and Jr Ntr's combination movie in proposals.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-జూ ఎన్టీఆర్ కాంబినేషన్లో మల్టీ స్టారర్ సినిమా రానుందా? ఈ పవర్ ఫుల్ కాంబినేషన్‌లో అద్భుతమైన సినిమా తెరకెక్కబోతోందా? అంటే ఇది సాధ్యం కావచ్చు అనే సంకేతాలు వినిపిస్తున్నాయి ఫిల్మ్ నగర్ నుంచి. బాలీవుడ్‌లో ఇప్పటికే పలు అగ్రహీరోల మల్టీ స్టారర్ సినిమాలు తెరకెక్కి సంచనల విజయాలు సాధించాయి. తాజాగా తెలుగు వెంకటేష్-మహేష్ బాబు హీరోగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే మల్టీ స్టారర్ సినిమా కూడా మొదలైంది.
ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని, ఓ ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఇందుకు సంబంధించిన ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం. పవన్ కళ్యాణ్, జూ ఎన్టీఆర్ మధ్య మంచి స్నేహ బంధం ఉన్న నేపథ్యంలో వీరి ప్రయత్నం ఫలిస్తుందనే సంకేతాలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ షూటింగులో బిజీగా గుడుపుతున్నాడు. హారిష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో శృతి హాసన్ హీరోయన్ కాగా బండ్ల గణేష్ నిర్మాత. మరో వైపు జూ ఎన్టీఆర్ బోయపాటి దర్శకత్వంలో ‘దమ్ము’ చిత్రంలో నటిస్తున్నాడు. త్రిష, కార్తీక జంటగా నటిస్తున్నఈ చిత్రంలో జూనియర్ డ్యూయల్ రోల్స్ చేస్తున్నాడు.
