Rajinikanth as Khadga Rudra
Rajinikanth's new project ‘Kochadaiyaan 3D’ and mainly it is the cine folks who are eyeing it sharply. Apparently, the Tollywood folks are keen on buying the dubbing rights and sources say RR Movie Makers are first in the list. Sources say the title might be ‘Khadga Rudra’.
స్టార్ హీరో రజనీకాంత్ అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత తన కూతురు సౌందర్య దర్శకత్వంలో తమిళంలో ‘కొచ్చాడయాన్’ అనే చిత్రంలో నటించడానికి సిద్దం అయిన సంగతి తెలిసిందే. ఈచిత్రం ద్వారా సౌందర్య దర్శకురాలిగా పరిచయం అవుతోంది. ప్రముఖ దర్శకుడు, రచయిత కె.ఎస్. రవికుమార్ ఈ చిత్రానికి కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వంలో సౌందర్యకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం యొక్క డబ్బింగ్ రైట్స్‌ను ప్రముఖ తెలుగు సినీ నిర్మాణ సంస్థ ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సొంతం చేసుకునే ప్రయత్నంలో ఉందని, తెలుగు ఈ చిత్రానికి ‘ఖడ్గ రుద్ర’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈచిత్రంలో రజనీకాంత్ లాంగ్ హెయిర్ తో శివున్ని పోలి ఉంటాడని, కత్తులతో పోరాటం చేసే యోధుడిగా కనిపించనున్నాడని, అందుకే ఈ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘రోబో’ చిత్రం తెలుగులో మంచి వసూళ్లు సాధించిన నేపథ్యంలో...ఆర్.ఆర్.మూవీ మేకర్స్ ఎలాగైనా ఈచిత్రాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వరుసగా పెద్ద హీరోల సినిమాలతో పాట, బిజినెస్ మేన్ లాంటి భారీ లాభాలు తెచ్చిన సినిమాతో ఆర్ఆర్ మూవీ మేకర్స్ మంచి ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే.
