Kajal Next Movie With Bollywood MegaStar
ఆ మధ్యన రోహిత్ శెట్టి రూపొందించిన 'సింగమ్'తో బాలీవుడ్ రంగప్రవేశం చేసిన కాజల్ ఆ తర్వాత ఎన్ని ఆఫర్స్ వచ్చినా ఓకే చెయ్యలేదు. స్టార్ హీరో సరసన వస్తేనే చేద్దామనుకున్నట్లుగా వెయిట్ చేస్తూ ఉండిపోయింది. ఆ ఆశలు ఫలించాయి. ఆమెకు తాజాగా అక్షయ్ కుమార్ ప్రక్కన హీరోయిన్ గా ఖరారైంది. 'వెన్స్ డే' చిత్రాన్ని రూపొందించిన నీరజ్ పాండే తాజాగా తెరకెక్కిస్తున్న 'స్పెషల్ చబ్బీస్'లో వీరిద్దరూ జత కట్టబోతున్నారు. వయాకామ్ 18 సంస్థ నిర్మిస్తోంది.
ఇటీవలే అనుపమ్ ఖేర్, జిమ్మి షెర్గిల్ మీద చిత్రీకరణ మొదలుపెట్టారు. మార్చి 1 నుంచి ఢిల్లీలో నాయకానాయికలపై కొన్ని సన్నివేశాల్ని తీయనున్నట్లు చిత్రవర్గాలు తెలిపాయి. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. ఇక ఈ చిత్రం విజయం ఆమెకు కీలకంగా మారనుంది. ఎందుకంటే సింగం సినిమా హిట్టైనా కాజల్ పెద్దగా పేరు రాలేదు. చిన్న చిన్న హీరోల ప్రక్కన మాత్రమే ఆమెకు ఆఫర్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ చిత్రం కనుక హిట్టైతే నెక్ట్స్ సల్మాన్ ఖాన్,హృతిక్ రోషన్,షారూఖ్ ఖాన్ వంటి స్టార్స్ ప్రక్కన ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తెలుగులో చేసిన త్రిష, అసిన్, జెనీలియా,ఇలియానా లు అక్కడ నిలదొక్కుకోవటానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు.
