Ram Charan Trying for Hrithik Roshan Body Language
రామ్ చరణ్ రోజూ బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ సినిమాలు చూస్తున్నాడని,అందులో అతని నటనని పరిశీలిస్తున్నాడని సమాచారం. దానికి కారణం రామ్ చరణ్ హిందీ ప్రేక్షకులకు అణుగుణంగా తన బాడీలాంగ్వేజ్ ని మార్చుకోవాలని నిర్ణయించుకోవటమేనని చెప్తున్నారు. రామ్ చరణ్ త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడనే సంగతి తెలిసిందే. జంజీర్ రీమేక్ గా రూపొందే ఆ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపధ్యంలో ఆ దర్శకుడు రామ్ చరణ్ కి హృతిక్ రోషన్ సినిమాలు చూడమని సూచించాడని చెప్తున్నారు.
అందుకు కారణం రీసెంట్ గా హృతిక్ రోషన్ ..అమితాబ్ క్లాసిక్ చిత్రం అగ్నిపధ్ రీమేక్ లో చేసి హిట్టు కొట్టారు. ఇప్పుడు అదే సేఫ్ రూటులో రామ్ చరణ్ వెళ్లటానికి రెడీ అవుతున్నారు. అమితాబ్ సినిమా రీమేక్ అంటే మినిమం ఓపినింగ్స్ ఉంటాయి..అమితాబ్ అభిమానులు తప్పనిసరిగా ఈ కాలానికి తగినట్లు జంజీర్ ని ఎలా మార్చారో చూడాలనుకుంటారని ఈ రీమేక్ ఉన్న ప్లానింగ్ అని బాలీవుడ్ వర్గాల కథనం. ఇక ఈ చిత్రంలో సంజయ్ దత్ ని ఇప్పటికే తీసుకుని ఈ చిత్రానికి క్రేజ్ తెచ్చారు. ఇక హృతిక్ రోషన్ ని పరిశీలించటం వరకూ రామ్ చరణ్ చేస్తే ఫరవాలేదు కానీ..అనుకరించాలని చూస్తే ప్రమాదం అంటున్నారు. ఎందుకంటే అక్కడ ఒరిజనల్ హృతిక్ రోషన్ దొరుకుతున్నాడని వ్యాఖ్యానిస్తున్నారు.
