Mahesh and Tri Vikram Saying Santoor
Mahesh Babu repeated his magic at Brand Endorsements in the New Year by bagging the Brand Ambassador deal of Santoor.
సూపర్ స్టార్ హహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కలిసి ప్రేక్షకులకు సోప్ వేయడానికి సిద్దం అవుతున్నారు. గత సంవత్సరం వివిధ కార్పొరేట్ బ్రాండ్లకు అంబాసిడర్ గా పని చేసిన మహేష్ బాబు ఈ సంవత్సరం కూడా తన హవా కొనసాగించనున్నాడు. ఇప్పటికే మల్లీ బ్రాండ్స్ కు ప్రచారం చేస్తున్న ఈ సూపర్ స్టార్ ఖాతాలో మరో బ్రాండ్ వచ్చి చేరనుంది. ప్రముఖ సబ్బు కంపెనీ ‘సంతూర్’ మహేష్ బాబుతో ప్రచారం చేయించి తమ ఉత్పత్తులను పెంచుకునే ప్రయత్నంలో ఉందట. ఈ మేరకు త్వరలోనే ఓ యాడ్ ఫిల్మ్ రూపొందించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాడ్ స్క్రిప్టు, దర్శకత్వం బాధ్యతలు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేపట్టున్నట్లు సమాచారం.
గతంలో త్రివిక్రమ్ పలు కార్పొరేట్ యాడ్లకు దర్శకత్వం వహించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో మహేష్ బాబును ఈ యాడ్ లో స్టయిలిష్ గా చూపిస్తారనే నమ్మకంతో ఈ బాధ్యతలు అతనికి అప్పగించే యోచనలో సంతూర్ కంపెనీ ఉందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
