Mahesh Babu Record in Twitter
Prince Mahesh Babu has created another record on the famous social networking site Twitter by reaching 3 Lakh mark in the followers count. Mahesh Babu is the first exclusive Tollywood celebrity to have 3 lakh followers count on the website Twitter.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరో రికార్డు నమోదు చేశాడు. మన రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో అభిమానులను సొంతం చేసుకున్న మహేష్ బాబు ట్విట్టర్లో మరో మైలు రాయిని దాటాడు. ఆయన్ను ఫోలో చేస్తున్న అభిమానుల సంఖ్య 3 లక్షల సంఖ్యను దాటింది. తెలుగు హీరోల్లో మహేష్ బాబుకు తప్ప ఈ రేంజ్ లో ఎవరికీ ట్విట్టర్ ఫాలోవర్స్ లేరు. ఇటీవల విడుదలైన మహేష్ బాబు సినిమాలు ‘దూకుడు’, ‘బిజినెస్ మేన్’ సినిమాలు వరుసగా భారీ విజయం సాధించడం వల్ల మహేష్ బాబు అభిమానుల సంఖ్య మరింత పెరిగిందని, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోని సినీ ప్రేమికులు కూడా ఆయన అభిమానుల లిస్టులో చేరారని అంటున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో నటిస్తున్నాడు. విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తున్న ఈచిత్రం మల్టీ స్టారర్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోంది. మహేష్ బాబు సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి హీరోయిన్లుగా ఎంపికయ్యారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
