Anushka Rejected his Marriage Proposal
హాట్ స్టార్ అనుష్క కి రీసెంట్ గా ఓ మ్యారేజ్ ప్రపోజల్ వచ్చిందని, దాన్ని ఆమె రిజెక్టు చేసిందని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆమెను ప్రపోజల్ పంపిన వారు ఎవరా అంటే బెంగుళూరుకి చెందిన ఓ ఎన్నారై డాక్టర్ అని తెలుస్తోంది. అతను ఆమెకు బాగా దగ్గర చుట్టం అవుతాడట. ఆమెను చాలా కాలంగా ఇష్టపడుతున్న అతను గతంలో ప్రపోజ్ చేసాడట. అయితే ఆమె నవ్వి కొట్టిపారేసింది. అయితే ఇప్పుడు తన కుటుంబం ద్వారా పెళ్లి ప్రపోజల్ పంపాడు. ఆమె దాన్ని నిర్విర్దంగా రిజెక్టు చేసిందని చెప్తున్నారు. తన కెరీర్ మంచి ఊపు మీదున్న ఈ టైమ్ లో పెళ్లి వంటివి పెట్టుకోదలుచుకోలేనని తేల్చి చెప్పిందిట.
ఇక అనుష్క త్వరలో ఓ గిరిజన యువతిగా,ఈ కాలం పాస్ట్ లైఫ్ కు చెందిన అమ్మాయిగా తమిళ చిత్రంలో ద్వి పాత్రాభినయం చేయనుంది. ఈ మేరకు సబ్జెక్టుని దర్శకుడు సెల్వ రాఘవన్ వినిపించి ఓకే చేయించుకున్నాడు. భారీ బడ్జెట్ తో రూపొందే ఈ చిత్రంలో గిరిజన యువతిగా ఉండే సన్నివేశాలు హైలెట్ గా ఉండబోతున్నాయని సమాచారం. అయితే ఈ చిత్రం గతంలో రానా తో తెలుగులో అనుకున్న కథే అని తెలుస్తోంది. అయిదువేల సంవత్సరాల క్రితం కథ అది. జానపదం ,చరిత్రాత్మకం కలిసి ఉంటుంది. పూర్తి వైవిధ్యమైన చిత్రం అవుతుంది. ఆర్య హీరోగా రూపొందే ఆ చిత్రం కోసం సెల్వ రాఘవన్ సంవత్సరం డేట్స్ అడిగాడని సమాచారం.
