12:12 | Posted by Andhra Gossips
The gorgeous Maryam Zakaria, who left youngsters wanting more with her sizzling Set Wet commercial, is slowly making inroads into T-town. After the item number Dealo Dealo in Naga Chaitanya’s 100% Love, the actress is now playing the lead in Madatha Kaja alongside Allari Naresh.
టాలీవుడ్ ను షేక్ చేసేందుకు వస్తోంది మరో ఫారిన్ మోడల్. పేరు మరియమ్ జక్రియ. తన హాట్ హాట్ అందాలతో ఇప్పటికే కుర్రకారు మతిపోగొడుతున్న జక్రియ ఇటీవల నాగచైతన్య హీరోగా విడుదలైన 100% లవ్ చిత్రంలో దియ్యాలో దియ్యాలో మెరిసి అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటికే బాలీవుడ్ లో అడుగిడిన స్వీడన్ కు చెందిన ఈ భామ ఇప్పుడు టాలీవుడ్ లో సెటిలయ్యేందుకు సన్నాహాలు చేస్తోంది. అల్లరి నరేష్ తాజా చిత్రం ‘మడత కాజ’ చిత్రంలో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది.
తెలుగులో నటించడంపై మరియమ్ మాట్లాడుతూ...ఇండియాలో నాకు హైదరాబాద్ రెండో ఇల్లు కాబోతోంది, ముంబై తరువాత నాకు బాగా నచ్చిన నగరం ఇది. అక్కడ బాలీవుడ్, ఇక్కడ టాలీవుడ్లో మంచి అవకాశాలు వస్తున్నాయని, ఇప్పుడిప్పుడే తెలుగు కూడా నేర్చుకుంటున్నాను అంటూ చెప్పుకొస్తోంది. ఐటం సాంగులకే పరిమితం కాకుండా, నటన విషయంలో తన సత్తా నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తానని అంటోంది. గత కొంత కాలంగా మన తెలుగు సినిమాలతో పాటు, బాలీవుడ్ సినిమాల్లో కూడా ఫారిన్ పాపల జోరు పెరుగుతోంది. కథలో భాగంగా ఫారిన్ పాపల అవసరం తప్పనిసరవుతోంది. ఇటీవల మన తెలుగులో వచ్చిన ‘తీన్‌మార్’ సినిమానే తీసుకుంటే పవన్ కళ్యాన్ సరసన ఓ ఫారిన్ భామ నటించిన విషయం తెలిసిందే. ఇటాలాంటి కథలు ఇటీవల బాలీవుడ్, కోలీవుడ్ లలో కూడా ఎక్కువవుతోంది. ఇవి కాకున్నా ఐటం సాంగుల అవకాశాలు బోలెడు. ఈ నేపథ్యం మరియమ్ కెరియర్ కి ఢోకా లేదనే చెప్పాలి.