Will Kajal Say Sorry For South Fans Like Hero Siddarth ?
Kajal Agarwal is on a roll with her latest stripping acts for top Bollywood magazine covers. Recently the actress, for the first time in her career, went topless for the 'FHM' magazine cover, August issue. The controversy prevailing with this photo shoot is that, the Bollywood actress has denied posing topless ever in her life and had even accused the magazine for allegedly morphing her picture.
సౌత్ సినిమాల్లో నటిస్తున్నా నేను ఉత్తరాది అమ్మాయినే..దక్షిణాది సినీ ప్రేక్షకులకు ట్రెండ్ గురించి సరిగ్గా తెలియదు..అంటూ రెండు సందర్భాల్లో సౌత్ సినీ పరిశ్రమపై వెటకారాలాడిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మహేష్ సరసన ‘ది బిజినెస్ మేన్’ సినిమాలో నటిస్తోంది. అసలు కాజల్ కి హీరోయిన్ గా గుర్తింపు దక్కిందే సౌత్ సినిమా పరిశ్రమలో. సౌత్ సినిమాల్లో హీరోయిన్ గా సక్సెస్ ల మీద సక్సెస్ లు కొట్టి, బాలీవుడ్ ‘సింగమ్’లో ఛాన్స్ దక్కించుకున్న కాజల్, సౌత్ సినీ పరిశ్రమని చిన్న చూసు చూడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.నిన్న మొన్నటిదాకా తనపై వచ్చిన విమర్శల్ని లైట్ తీసుకున్న కాజల్, రేపో మాపో సౌత్ ప్రేక్షకులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిసైడ్ అయ్యిందట. తన వ్యాఖ్యల్నివక్రీకరించారనీ, ఎవరైనా బాధపడి వుంటే తనను క్షమించాలనీ కాజల్ కోరనున్నట్లు సమాచారం. ఆ మధ్య హీరో సిద్ధార్థ ఎలక్ట్రానిక్ మీడియాపై అక్కసు వెల్లగక్కడం, ఆ తర్వాత నిర్మాత ‘దిల్’ రాజు హెచ్చరికలతో దిగొచ్చి మీడియాకి సిద్దార్థ క్షమాపణ చెప్పడం తెల్సిన విషయాలే. మరిప్పుడు పూరి, కాజల్ తో సౌత్ సినీ పరిశ్రమకి క్షమాపణ చెప్పిస్తాడా...?మరి కాజల్ క్షమాపణ నిజంగానే చెపుతుందా..? వెయిట్ అండ్ సీ ఏం జరుగుద్దో.
కాజల్ అగర్వాల్ తెలుగు సినిమా హీరోయిన్‌గా మంచి గుర్తింపునే సంపాదించుకుంది. అటు తర్వాత తమిళంలో కూడా మంచి విజయాలనే అందుకుంది. ఇక ఏ హీరోయిన్ అయితే బాలీవుడ్లో సెటిల్ కావాలని కలలు కనడం తెలిసిందే.. అందరు తారామణుల లాగానే కాజల్ కూడా బాలీవుడ్ కి జంప్ అయింది. అయితే అక్కడ కాంపీటీషన్ ఎక్కువగా ఉండటం, ఆశించిన స్థాయిలో అవకావాలు దొరక్కపోవడంతో అక్కడే సెటిల్ అవ్వాలనే ఆలోచనతో పబ్లిసిటీని ఎలా పెంచుకోవాలా, బాలీవుడ్‌లో ఎలా పాగా వేయాలా అనుకున్న కాజల్ కొద్ది రోజుల క్రితం ఎఫ్ హెచ్ ఎమ్ మ్యాగజైన్ ముఖచిత్రంపై టాప్ లెస్ గా ఫోజిచ్చి జనాలకి గట్టి షాకిచ్చింది. ఆ తర్వాత అవి తనవి కావని బుకాయించినా ఫోటో షూట్ సంబంధించిన వీడియోలు ఉన్నాయని ఆ మ్యాగజైన్ వారు అనేసరిక ప్లేటు ఫిరాయించిన విషయం తెలిసిందే.
