Mega Family Films in 2012
టాలీవుడ్ మొత్తం మరికొద్ది నెలల్లో రాబోయే మెగా సునామీ వైపు ఆసక్తి గా చూస్తోంది. మెగా క్యాంప్ కు చెందిన ముగ్గరు హీరోలు తమ తమ క్రేజీ ప్రాజెక్టులతో ఒకే సారి రంగంలోకి దూకుతున్నారు. 2012లో వస్తున్న ఈ మెగా సునామీ ఎన్ని రికార్జులు క్రియేట్ చేసి ఎందరి రికార్డులు నామరూపాలు లేకుండా చేస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మెగా హీరోలు ముగ్గురూ రెండు మూడు నెలల్లో భాక్సాఫీస్ వద్ద తమ ప్రతాపం చూపించటానకి రెడీ అవుతున్నారు. దాంతో వచ్చే ఆరు నెలలు పాటు ధియోటర్స్ లో మెగా హీరోలదే హవా అని అంచనాలు వేస్తున్నారు. ఈ సునామీలో మొదటగా దూకుతోంది రచ్చ.
రామ్ చరణ్, సంపత్ నంది దర్సకత్వంలో రూపొందిన ఈ చిత్రం మాస్ ఎంటర్టైనర్ గా రెడీ అయ్యి రంగంలోకి దూకుతోంది. ఆరెంజ్ తర్వాత వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ వస్తోంది. బాలీవుడ్ హిట్ దబాంగ్ రీమేక్ గా వస్తున్న ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ రూపొందింస్తున్నారు. పంచ్ లైన్స్ తో విడుదలైన ట్రైలర్ ఇప్పటికే అందరినీ అలరిస్తోంది. పంజా చిత్రం తర్వాత వస్తున్న ఈ చిత్రంపై పవన్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇక వీటి తర్వాత వస్తున్న చిత్రం అల్లు అర్జున్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో రెడీ అవుతన్న చిత్రం.
ఇలియానా కాంబినేషన్ లో రుపొందుతున్న ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. బద్రీనాధ్ చిత్రం అనంతరం బన్నీ చేస్తున్న ఈ చిత్రం గ్యారెంటీగా ఘన విజయం సాదిస్తుందని చెప్తున్నారు. ఇవి విడుదల అయ్యేసరికి వినాయిక్ దర్శకత్వంలో రూపొందుతన్న రామ్ చరణ్ చిత్రం రెడీ అవుతుంది. ఆ చిత్రం విడుదల అయితే మెగా క్యాప్ హవా కొనసాగుతుంది.
